డివోర్స్ పోస్ట్ డిలీట్ చేసిన సమంత.. మళ్లీ కలుస్తారా అంటూ..

Samantha Deleted Post About Separation With Naga Chaitanya
x

డివోర్స్ పోస్ట్ డిలీట్ చేసిన సమంత.. మళ్లీ కలుస్తారా అంటూ..

Highlights

Samantha: టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ నాగచైతన్య-సమంత డివోర్స్ తీసుకున్న సంగతి తెలిసిందే.

Samantha: టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ నాగచైతన్య-సమంత డివోర్స్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విష‌యాన్ని తెలుపుతూ గ‌త ఏడాది వారిద్ద‌రూ సామాజిక మాధ్య‌మాల ద్వారా ప్ర‌క‌ట‌న‌లు చేశారు. ఆ త‌ర్వాత చాలా రోజుల వరకు వీరి విడాకులు వార్తల్లో నిలిచాయి. ఇప్పటికి కూడా వీరిద్దరి విడాకుల గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది. అయితే తాజాగా సామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి విడాకుల ప్రకటనను తొలగించింది. దీంతో అభిమానుల్లో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి.

సామ్‌ ఎందుకు దాన్ని డిలీట్‌ చేసింది? వీళ్లిద్దరూ మళ్లీ కలిసిపోతున్నారా? లేదంటే మరేదైనా కారణం ఉందా? అని రకరకాలుగా ఆలోచిస్తున్నారు. ఒకవేళ నిజంగానే వీళ్లకు కలిసిపోయే ఉద్దేశ్యం ఉంటే చైతూ కూడా ఆ పోస్ట్‌ డిలీట్‌ చేసేవాడు, కానీ అలా జరగలేదు. అంటే చైసామ్‌ మళ్లీ కలిసే ఛాన్స్‌ లేనట్లు కనిపిస్తోంది. కాకపోతే సామ్‌ పొరపాటునో లేదా అవసరం లేదనో భావించి ఆ నోట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి తీసేసి ఉండవచ్చని పలువురు నెటిజన్లు భావిస్తున్నారు.

కాగా, స‌మంత వ‌రుస‌గా కొత్త ప్రాజక్టులకు ఓకే చెబుతూ బిజీగా మారిపోయింది. మరోపక్క, నాగ చైత‌న్య న‌టించిన బంగార్రాజు సినిమా భారీగా వ‌సూళ్లు రాబ‌డుతోన్న విష‌యం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories