Samantha: షూటింగ్‌లో కన్నీళ్లు పెట్టుకున్న సమంత

Samantha: టాలీవుడ్ స్టార్ కపుల సమంత మరియు నాగ చైతన్య విడాకుల విషయం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

admin1
Published on: 7 Oct 2021 7:38 PM IST
Samantha Cry At The Shooting Spot
X

Samantha: షూటింగ్‌లో కన్నీళ్లు పెట్టుకున్న సమంత

Samantha: టాలీవుడ్ స్టార్ కపుల సమంత మరియు నాగ చైతన్య విడాకుల విషయం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. వీరు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు అని అభిమానులు అనుకుంటున్న సమయంలో ఇకపై తాము భార్యాభర్తలుగా కలిసి ఉండలేము అని సామ్ మరియు చై ప్రకటించటం అభిమానులను కంటతడి పెట్టిస్తోంది. విడాకుల తర్వాత కూడా సమంతా ప్రొఫెషనల్ లైఫ్ లో బిజీగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ మధ్యనే తాజాగా ఒక యాడ్ షూట్ లో పాల్గొంది. హైదరాబాద్ లోని ముకరంజా జూనియర్ కాలేజీలో ఈ యాడ్ కి సంబంధించిన షూటింగ్ జరిగింది.

అయితే ముంబైకి చెందిన ఫిలిం మేకర్ విశేష్ వర్మ ఈ యాడ్ కి దర్శకత్వం వహించారు. అయితే షూట్‌ గ్యాప్‌లో సమంత తీవ్ర భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నట్లు యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. దానికి కారణం విడాకులు అని కొందరు చెబుతున్నారు. విడాకుల ప్రకటన తర్వాత సమంత చాలా కుంగిపోయినట్లు పేర్కొన్నారు యూనిట్ సభ్యులు. అయితే మనసులో ఎంత బాధ ఉన్నప్పటికీ కెమెరా ముందుకు రాగానే మాత్రం సమంత డైరెక్టర్‌ చెప్పినట్లు నటించిందట. దీంతో వర్క్ విషయంలో సమంత కి ఉన్న అంకితభావం గొప్పదని యూనిట్‌ సభ్యులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

admin1

admin1

Next Story