Samantha: "టాలీవుడ్ ఎప్పటికీ నా ఇల్లు" అంటున్న సమంత

admin1
Updated on: 27 Nov 2021 4:50 PM IST
Samantha Comments Tollywood is Like My Home | Samantha Latest News
X

Samantha: "టాలీవుడ్ ఎప్పటికీ నా ఇల్లు" అంటున్న సమంత

Samantha Latest News: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో "శాకుంతలం" సినిమా లో హీరోయిన్ గా నటిస్తున్న సమంత ఇప్పటికే పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులకు సైన్ చేసింది. ఒకవైపు తెలుగులో కూడా మాత్రమే కాక పరభాషలలో కూడా తన సత్తా చాటుతోంది సమంత. ఈ మధ్యనే "ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2" తో అందరి దృష్టిని ఆకర్షించిన సామ్ హిందీ ప్రాజెక్ట్ లు కూడా సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఒక అభిమాని ఆమెని నార్త్ ఇండస్ట్రీ గురించి ఒక ప్రశ్న అని అడిగారు.

"నార్త్ ఇండస్ట్రీ లో పని చేయటం ఎలా ఉంది" అని అడగగా, "అసలు నేను నార్త్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక భాగమేనా? ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ నాకు ఇల్లు లాంటిది. హైదరాబాద్ ఎప్పటికీ నాకు ఇల్లే. ఇక్కడ ప్రేక్షకులకు నా గుండెల్లో ఎప్పుడు స్పెషల్ స్థానం ఉంటుంది" అని చెప్పుకొచ్చారు సమంత. ఇక నాగచైతన్య తో విడిపోయిన తరువాత సమంత టాలీవుడ్ వదిలి వెళ్ళిపోతుంది అని చాలా పుకార్లు వినిపించాయి కానీ సమంత మాత్రం తాను హైదరాబాద్లోనే ఉంటానని తెలుగు సినిమాల్లోనే నటిస్తాను అని క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

admin1

admin1

Next Story