Samantha: అక్కినేని హీరోలతో సమంత క్లాష్

Samantha Clash with Naga Chaitanya and Akhil | Tollywood News
x

Samantha: అక్కినేని హీరోలతో సమంత క్లాష్

Highlights

Samantha: అక్కినేని హీరోలతో సమంత క్లాష్

Samantha: ఈ మధ్యనే "బంగార్రాజు" సినిమాతో మంచి హిట్ అందుకున్న ఆ నాగచైతన్య తాజాగా ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న "లాల్ సింగ్ చద్దా" ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న నాగచైతన్య ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టబోతున్నారు. మంచి అంచనాల మధ్య ఈ సినిమా ఆగష్టు 11న విడుదలకు సిద్ధమవుతోంది.

మరోవైపు స్టార్ బ్యూటీ సమంత "యశోద" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా ను ఆగస్టు 12న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది.ప్రేమించి పెళ్లి చేసుకొని ఈ మధ్యనే విడాకులు తీసుకున్న సమంత మరియు నాగ చైతన్య ల మధ్య బాక్సాఫీస్ క్లాష్ ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ బరిలోకి నాగచైతన్య తమ్ముడు అఖిల్ కూడా చేరారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటిస్తున్న స్పై త్రిల్లర్ "ఏజెంట్" ను కూడా ఆగష్టు 12న విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో బాక్సాఫీస్ వద్ద ఇలాంటి ఆసక్తికరమైన క్లాష్ జరగలేదు. మరి ఈ మూడు సినిమాల్లో కలెక్షన్ల పరంగా ఏ సినిమా విజేత గా నిలుస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories