Samantha: ఒక్క పోస్ట్ కి 25 లక్షలు తీసుకుంటున్న సమంత ?

Samantha: ప్రస్తుతం ఇండస్ట్రీలో చలామణి అవుతున్న స్టార్ హీరోయిన్లలో సమంత అక్కినేని ముందు వరుసలోనే ఉంటుంది.

admin1
Published on: 12 Aug 2021 8:25 PM IST
Samantha Charging Rs 25 Lakhs For Instagram Promotion
X

Samantha: ఒక్క పోస్ట్ కి 25 లక్షలు తీసుకుంటున్న సమంత ?

Samantha: ప్రస్తుతం ఇండస్ట్రీలో చలామణి అవుతున్న స్టార్ హీరోయిన్లలో సమంత అక్కినేని ముందు వరుసలోనే ఉంటుంది. ఒకవైపు సినిమాలు మరో వైపు వెబ్ సిరీస్ మాత్రమేకాక బ్రాండ్ ఎండార్స్మెంట్స్, రిబ్బన్ కటింగ్స్ మరియు టీవీ షోలతో కూడా సమంత ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా సమంత తన అధికారిక ఇంస్టాగ్రామ్ అకౌంట్ ను సైతం వాడుకుని డబ్బులు సంపాదిస్తున్నట్లు సమాచారం. సినిమాలు, వెబ్ సిరీస్ వంటి ప్రాజెక్టులకు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సమంత ఇటు ఇంస్టాగ్రామ్ లో పెట్టే ప్రతి పోస్ట్ కి కూడా లక్షల్లో సంపాదిస్తున్నారు అని బోగట్టా.

తాజా సమాచారం ప్రకారం సమంత తన ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన ఒక పోస్ట్ కి దాదాపు 25 నుండి 30 లక్షల వరకు తీసుకుంటోందని సమాచారం. ఎంతైనా ఆమె పాపులారిటీ అలాంటిది. సోషల్ మీడియాలో 18 మిలియన్ ఫాలోవర్స్ ను ఉన్న సమంత సోషల్ మీడియాను కూడా బాగానే వాడేస్తోంది. ఒకవైపు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన ఫోటోలను షేర్ చేసే సమంత మరోవైపు కమర్షియల్ పోస్టును కూడా షేర్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తోంది. మిగతా హీరోయిన్లు అందరూ ఒక పోస్ట్ కి ఎనిమిది నుండి పది లక్షల దాకా తీసుకుంటే సమంతా మాత్రం ఈ విషయంలో తగ్గేదే లే అంటూ 25 నుండి 30 లక్షలు డిమాండ్ చేస్తోందట.

admin1

admin1

Next Story