Samantha Remuneration: సమంత కి అంత రెమ్యూనరేషన్ జరగని పనట

Samantha Remuneration: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ఈ మధ్యనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప: ది రైజ్"

admin1
Published on: 19 Jan 2022 12:23 PM IST
Samantha Charged Rs 5 Crore For Oo Antava Song
X

Samantha Remuneration: సమంత కి అంత రెమ్యూనరేషన్ జరగని పనట

Samantha Remuneration: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ఈ మధ్యనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప: ది రైజ్" సినిమాలో "ఊ అంటావా ఊ ఊ అంటావా" అంటూ ఐటమ్ సాంగ్లో బన్నీతో కలిసి స్టెప్పులేసిన సంగతి తెలిసిందే. ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజానికి ఈ పాట కోసం ఆమె తీసుకున్న 1.25 కోట్లు అని ఇప్పటికే టాలీవుడ్ లో వార్తలు వినిపించాయి. అయితే తాజాగా బాలీవుడ్ లో ఈ పాట గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేస్తోంది. ఈ పాట కోసం ఏకంగా మైత్రి మూవీ మేకర్స్ వారి నుంచి సమంత 5 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకున్నట్లు బాలీవుడ్ వర్గాల బోగట్టా.

కొందరైతే ఆమె నిజంగానే 5 కోట్లు తీసుకున్నట్లు పీఆర్ టీమ్ కూడా ఒప్పుకున్నట్లు పుకార్లు పుట్టిస్తున్నారు. నిజానికి టాలీవుడ్ లో మిగతా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే వంటివారు సినిమాకి రెండు నుంచి రెండున్నర కోట్ల వరకు తీసుకుంటున్నారు. కేవలం ఒక్క ఐటెం సాంగ్ కి ఐదు కోట్లు ఇవ్వడం జరగని పని. అంత బడ్జెట్టే ఉంటే బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కూడా ఈ ఐటం సాంగ్ చేయడానికి క్యూ కట్టేవారు. ఇక బడ్జెట్ సంగతి పక్కన పెడితే సమంతాకి అంత రెమ్యునిరేషన్ వచ్చింది అనే మాటలలో ఏ మాత్రం వాస్తవం లేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

admin1

admin1

Next Story