చైతూతో కలిసి ఉన్న ఇంటినే ఎక్కువ రేటుకు కొనుక్కున్న సమంత

Samantha Buys House Where She Live With Naga Chaitanya
x

చైతూతో కలిసి ఉన్న ఇంటినే ఎక్కువ రేటుకు కొనుక్కున్న సమంత

Highlights

Tollywood: ఎంతో అన్యోన్యంగా ఉండే నాగచైతన్య మరియు సమంత విడాకుల విషయం ఇప్పటికే చాలా మంది అభిమానులు జీర్ణించుకోలేని ఒక చేదు నిజం గా మారిన సంగతి తెలిసిందే.

Tollywood: ఎంతో అన్యోన్యంగా ఉండే నాగచైతన్య మరియు సమంత విడాకుల విషయం ఇప్పటికే చాలా మంది అభిమానులు జీర్ణించుకోలేని ఒక చేదు నిజం గా మారిన సంగతి తెలిసిందే. ఏ మాయ చేసావే సినిమా సెట్స్ పైన కలిసిన వీరిద్దరి స్నేహం ప్రేమగా మారి 2017 లో వీరు పెళ్లి చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ టాలీవుడ్ స్టార్ కపుల్ గతేడాది విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఎవరిదారిన వారు సినిమాలు చేసుకుంటూ కరియర్ లో ముందుకు వెళ్తున్నారు. తాజాగా సమంతకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నాగచైతన్యతో కలిసి గతంలో తాను ఉన్న ఇంటిని సమంత రూ.కోట్లు ఖర్చు చేసి మరీ దక్కించుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. సమంత, నాగచైతన్య హైదరాబాద్‌లో ఎంతో ఇష్టపడి తమ ఇల్లు కొనుగోలు చేశారని.. వివాహం తర్వాత ఆ ఇంట్లోనే ఉన్నారని.. తర్వాత వారిద్దరూ కలిసి ఓ ఇండిపెండెంట్‌ హౌస్‌ కొనుక్కోవడంతో వాళ్ళు ఉన్న ఇంటిని వేరే వాళ్ళకు అమ్మేశారని నటుడు మురళీమోహన్ ఓ ఇంటర్వూలో వెల్లడించారు. అయితే వారు కొనుక్కున్న ఇల్లు రీ మోడలింగ్ చేయించేంతవరకు పాత ఇంట్లోనే రెంట్‌కు ఉంటామని చెప్పడంతో సమంత వాళ్ల దగ్గర ఇల్లు కొనుక్కున్న వాళ్ళు అంగీకారం తెలిపారన్నారు. అంతా బాగానే ఉందనుకునే సమయంలో చై-సామ్‌ విడిపోయారు.

విడిపోయిన రోజు చైతన్య.. తన సామానంతా తీసుకుని వెళ్లిపోయాడు. సామ్‌ కూడా కొన్నిరోజుల తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత మరో ఇంటి కోసం సామ్‌ హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో వెతికింది. మళ్లీ తిరిగి నా వద్దకే వచ్చింది. ''నాకు ఈ ఇల్లు బాగా నచ్చింది. ఇలాంటి అందమైన, ప్రశాంతమైన ఇల్లు మళ్లీ నాకు దొరకడం లేదు. ఈ ఇల్లు మళ్లీ నేను తీసుకోవచ్చా?'' అని అడిగింది. దాంతో నేను, ఆ ఇంటిని ఎవరికైతే అమ్మారో వాళ్లతో మాట్లాడాను. అలా, సామ్‌ ఎక్కువ డబ్బులు చెల్లించి మరీ ఆ ఇంటిని మళ్లీ కొనుగోలు చేసింది. ప్రస్తుతం సామ్‌, వాళ్లమ్మ అక్కడే ఉంటున్నారు'' అని మురళీమోహన్‌ చెప్పుకొచ్చారు.


Show Full Article
Print Article
Next Story
More Stories