Samantha: మీకంటే ఎక్కువగా నన్ను ఎవరు ప్రేమించగలరు..

Samantha: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది.

Dhatripriya
Published on: 28 March 2023 1:29 PM IST
Samantha Attracted Everyones Attention With A Reply To Fan
X

Samantha: "మీకంటే ఎక్కువగా నన్ను ఎవరు ప్రేమించగలరు," అంటున్న సమంత 

Samantha: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. తన సినిమాల గురించి మాత్రమే కాక వ్యక్తిగత విషయాల గురించి కూడా సమంతా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ట్రోల్ చేసే వారికి నోరుమూయించేలాగా సమాధానాలు కూడా ఇస్తూ ఉంటుంది ఈ భామ. అయితే తాజాగా ఒక అభిమాని స్నేహ పూర్వకంగా చెప్పిన ఒక సలహా కి సమంత స్వీట్ గా రిప్లై ఇచ్చింది. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ఈ మధ్యనే సోషల్ మీడియాలో ఒక అభిమాని సమంతకి సంబంధించిన ఒక వీడియోని షేర్ చేస్తూ ఇలా అడిగాడు, "నాకు చెప్పే అర్హత లేదని తెలుసు కానీ ప్లీజ్ మీరు ఎవరో ఒకరిని డేట్ చేయండి," అని అభిమాని సలహా ఇచ్చాడు. దానికి సమంత కూడా చాలా స్వీట్ గా రిప్లై ఇచ్చింది. "నన్ను మీరు ప్రేమించినంతగా ఇంకా ఎవరు ప్రేమించగలరు," అంటూ తన రిప్లైతో అభిమానులను మరింత ప్రేమలో పడేలా చేసింది సమంత.

"ఎం మాయ చేసావే", "మనం" వంటి సూపర్ హిట్ సినిమాలలో జంటగా నటించిన నాగచైతన్య మరియు సమంత 2017 లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కానీ వీరిద్దరూ 2021 లో విడిపోయిన సంగతి తెలిసిందే. ఇక అప్పటినుంచి సమంత సింగిల్ గానే ఉంది. మరోవైపు మయోసైటిస్ అని అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత ఈ మధ్యనే కోలుకుంటుంది. ఇక సినిమాల పరంగా చూస్తే సమంత హీరోయిన్ గా నటించిన "శాకుంతలం". ఏప్రిల్ 14న థియేటర్లలో విడుదల కాబోతోంది.

Dhatripriya

Dhatripriya

Next Story