Citadel Honey Bunny trailer: సిటడెల్‌ ట్రైలర్‌ వచ్చేసింది.. యాక్షన్‌ సీన్స్‌లో సమంత కేక అంతే..

Citadel Honey Bunny trailer: సమంత, వరుణ్‌ ధావన్‌ లీడ్‌ రోల్‌లో నటించిన సిటడెల్‌ వెబ్ సిరీస్‌పై ఎంతటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 15 Oct 2024 3:47 PM IST
Citadel Honey Bunny trailer
X

Citadel Honey Bunny trailer

Citadel Honey Bunny trailer: సమంత, వరుణ్‌ ధావన్‌ లీడ్‌ రోల్‌లో నటించిన సిటడెల్‌ వెబ్ సిరీస్‌పై ఎంతటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫ్యామిలీ మ్యాన్‌ ఫేమ్‌ రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహించిన ఈ వెబ్‌ సిరీస్‌ కోసం యావత్ ఇండియన్‌ ఫిలిమ్‌ ఇండస్ట్రీ ఎదురు చూస్తోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో హాలీవుడ్‌ సిరీస్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సిరీస్ స్ట్రీమింగ్‌కు సిద్దమైంది.

నవంబర్‌ 7వ తేదీ నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ వెబ్ సిరీస్‌ హిందీతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రీమియం కానుంది. విడుదల తేదీ స్ట్రీమింగ్‌ కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచేసింది. ఇందులో భాగంగానే తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ట్రైలర్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. సిటడెల్‌ వెబ్ సిరీస్‌పై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.

2.51 నిమిషాల నిడివి ఉన్న సిటాడెల్‌ ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. స్టంట్‌మ్యాన్ బన్నీ, హనీ చుట్టూ తిరిగే కథాంశంతో వెబ్‌ ప్రాజెక్ట్‌ ఉండబోతున్నట్టు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. ట్రైలర్ ఫన్నీ ట్రాక్‌, ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లు, అద్భుతమైన విజువల్స్‌తో ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ మ్యాన్‌2ని మంచి సమంత ఇందులో యాక్షన్‌ సన్నివేశాల్లో కనిపిస్తోంది. సమంత ఇందులో ఏజెంట్‌గా కనిపించనుందని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది.

ఈ వెబ్ సిరీస్‌లో కేకే మీనన్‌, సిమ్రన్‌, సోహం మజుందార్‌, శివంకిత్‌ పరిహార్‌, కశ్వీ మజుందార్‌, సాఖిబ్‌ సలీం, సికిందర్‌ ఖేర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నవంబర్‌ 7వ తేదీ నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న సిటడెల్ దేశవ్యాప్తంగా ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేస్తుందో చూడాలి.



హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story