త్వరలో అధికారికంగా లాంచ్ ఇవ్వబోతున్న'96' రీమేక్

త్వరలో అధికారికంగా లాంచ్ ఇవ్వబోతున్న96 రీమేక్
x
Highlights

విజయ్ సేతుపతి, త్రిష హీరోహీరోయిన్లుగా నటించిన తమిళ సినిమా '96' బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. రొమాంటిక్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన...

విజయ్ సేతుపతి, త్రిష హీరోహీరోయిన్లుగా నటించిన తమిళ సినిమా '96' బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. రొమాంటిక్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈచిత్రం రికార్డులను తిరగరాసింది. ఈ సినిమా విడుదలకు ముందే ఈ చిత్రం తెలుగు రీమేక్ రైట్స్ ను దిల్ రాజు సొంతం చేసుకున్నారు. కాగా ఈ చిత్రాన్ని తెలుగులో సమంత శర్వానంద్ ను హీరో హీరోయిన్లుగా పెట్టి ఈ సినిమా రీమేక్ తీయాలని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా అధికారిక టైటిల్ ప్రకటించలేదు కానీ ప్రస్తుతం దర్శక నిర్మాతలు ఈ చిత్రానికి 'జాను' అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

తమిళ్ వెర్షన్ కి దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ తెలుగు రీమేక్ వెర్షన్ కి కూడా దర్శకత్వం వహించనున్నారు. తాజాగా ఉగాది సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా లాంచ్ ని చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక తమిళ '96' సినిమాకు గోవింద్ వసంత అందించిన మెలోడీ మ్యూజిక్ బాగా ప్లస్ అయింది. అందుకే తెలుగు రీమేక్లో కూడా ఈయనే సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగు రీమేక్ వెర్షన్ కి కూడా గోవింద్ వసంత అందించే సంగీతం హైలైట్ గా మారుతుందని దిల్ రాజు విశ్వసిస్తున్నారు. మరి తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన ఈ చిత్రం తెలుగులో ప్రేక్షకులను ఎంతవరుకు మెప్పిస్తుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories