Samantha - Raj: ఒకే కారులో సమంత, రాజ్.. వీడియో వైరల్..!

Samantha and Raj Nidimoru Spotted Together in Same Car, Video Sparks Dating Rumours
x

Samantha - Raj: ఒకే కారులో సమంత, రాజ్.. వీడియో వైరల్..!

Highlights

Samantha - Raj: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు (Raj Nidimoru) డేటింగ్‌లో ఉన్నారన్న వార్తలు గత కొంతకాలంగా ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

Samantha - Raj: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు (Raj Nidimoru) డేటింగ్‌లో ఉన్నారన్న వార్తలు గత కొంతకాలంగా ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ తరచూ కలిసి వెకేషన్‌లకు వెళ్లడం, పబ్లిక్ ప్లేసుల్లో కనిపించడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చుతోంది.

తాజాగా, సమంత-రాజ్ జోడీ మరోసారి మీడియా కంట పడింది. ఇద్దరూ ఒకే కారులో బయటికి వెళ్తూ కనిపించడంతో, ఫొటోగ్రాఫర్లు వీరిని క్లిక్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ కలిసి ఓ రెస్టారెంట్‌కి డిన్నర్‌కు వెళ్లినట్లు సమాచారం. సమంత కాజువల్ వైట్ డ్రెస్‌లో చీరిన నవ్వుతో మెరిసిపోగా, రాజ్ కూడా కూల్ లుక్‌లో కనిపించారు.

ఇద్దరూ డిన్నర్ తర్వాత కూడా ఒకే కారులో తిరిగి ఇళ్లకు వెళ్లడంతో, మరోసారి వీరి మధ్య రిలేషన్‌షిప్ ఉందన్న ప్రచారం ఊపందుకుంది.

ఇటీవల సమంత, రాజ్-డీకే దర్శకత్వంలో వచ్చిన వెబ్ సిరీస్‌లు ‘ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2’ మరియు ‘సిటడెల్: హనీ బన్నీ’ లో నటించారు. ఈ ప్రాజెక్టుల సమయంలోనే వీరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడిందని అంటున్నారు. అప్పటి నుంచి సమంత-రాజ్ మధ్య స్నేహం మించిన బంధం ఉందనే ప్రచారం సాగుతోంది.

తాజాగా వీరు కలిసి వెకేషన్‌కి వెళ్లిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. అయితే, వీరి మధ్య వాస్తవంగా డేటింగ్ నడుస్తోందా? అనే అంశంపై మాత్రం ఇంతవరకు ఏదైనా అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇక అసలు విషయం ఎంత వరకు నిజమో తెలియాలంటే సమంత లేదా రాజ్ ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందించే వరకూ ఆగాల్సిందే!


Show Full Article
Print Article
Next Story
More Stories