సమంత, నాగ చైతన్యను కలిపేందుకు లేడీ డైరెక్టర్ రంగంలోకి..

Tollywood: మాజీ భర్తతో సినిమా చేయబోతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్?

Arun Chilukuri
Published on: 4 April 2022 1:15 PM IST
Tollywood Star Heroine is Going To Do A Movie With Her Ex-Husband?
X

మళ్లీ నాగచైతన్య తో రొమాన్స్ చేయబోతున్న సమంత?

Tollywood: ఎంతో అన్యోన్యంగా ఉండే నాగచైతన్య మరియు సమంత విడాకుల విషయం ఇప్పటికే చాలా మంది అభిమానులు జీర్ణించుకోలేని ఒక చేదు నిజం గా మారిన సంగతి తెలిసిందే. "ఏ మాయ చేసావే" అనే సినిమాతో మొట్టమొదటిసారిగా కలిసి నటించిన నాగచైతన్య మరియు సమంత తమ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ తో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. ఆ తర్వాత "ఆటో నగర్ సూర్య", "మనం" వంటి సినిమాల్లో కూడా కలిసి నటించిన ఈ జంట పెళ్లి తర్వాత శివ నిర్వాణ డైరెక్షన్లో "మజిలీ" అనే సినిమాతో మరొక హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు.

అయితే నందిని రెడ్డి డైరెక్షన్లో సమంత హీరోయిన్గా నటించిన "ఓ బేబీ" సినిమాలో కూడా నాగ చైతన్య ఒక క్యామియో పాత్రలో కనిపించారు. అయితే ఆ సినిమా తర్వాత తమ విడాకులను ప్రకటించిన ఈ జంట మళ్లీ కలిసి ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నందిని రెడ్డి సిద్ధం చేసిన ఒక స్క్రిప్ట్ నాగ చైతన్య కి బాగా నచ్చిందట. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం సమంతను ఎంపిక చేయాలని నందినిరెడ్డి ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి తన మాజీ భర్త తో సమంత మళ్లీ వెండితెరపై కనిపిస్తుందో లేదో అని ఇంకా తెలియాల్సి ఉంది. వీరిద్దరూ విడాకులు తీసుకున్నప్పటికీ వీరి కాంబినేషన్ పై ఇప్పటికీ ప్రేక్షకులకు లో మంచి క్రేజ్ ఉంది అనడం అతిశయోక్తి కాదు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story