విజయ్ దేవరకొండ పై మండి పడుతున్న సమంత మరియు మెగా అభిమానులు

*విజయ్ దేవరకొండ పై మండి పడుతున్న సమంత మరియు మెగా అభిమానులు

Rama Rao
Published on: 17 May 2022 1:02 PM IST
Samantha and Mega Fans Angry over Vijay Devarakonda | Telugu News
X

విజయ్ దేవరకొండ పై మండి పడుతున్న సమంత మరియు మెగా అభిమానులు

Vijay Deverakonda: టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ మరియు స్టార్ బ్యూటీ సమంత కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. "నిన్ను కోరి" ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా "ఖుషి" అనే టైటిల్ తో విడుదల కాబోతోంది. 2001లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు నటించిన సినిమా "ఖుషి" అప్పట్లో ఒక అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఇప్పుడు ఆ సినిమా టైటిల్ ని ఈ సినిమాకి వాడటమే కాకుండా సినిమా పోస్టర్ లో నోట్లో సిగరెట్టు తో విజయ్ దేవరకొండ కనిపించిన లుక్ కూడా ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉందని పవన్ కళ్యాణ్ అభిమానులు మండి పడుతున్నారు. మరో వైపు సమంత అభిమానులు కూడా ఫస్ట్ లుక్ పోస్టర్ తో నిరాశ చెందినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ కంటే సమంత ఇంకా పెద్ద స్టార్.

విజయ్ కంటే సమంతా ఖాతాలోనే ఎక్కువ బ్లాక్ బస్టర్ లు ఉన్నాయి.అయినా సరే సమంత పేరుని కేవలం సమంతా గానే ఉంచి విజయ్ దేవరకొండ పేరుని మాత్రం ది విజయ్ దేవరకొండ అని పెట్టటం ఏ మాత్రం బాగా లేదని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చాలా వరకు కాశ్మీర్ లో ఆర్మీ బ్యాక్ డ్రాప్ తో నడుస్తుందని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story