Samantha: ఇన్స్టాగ్రామ్ లో పేరు మార్చుకోవడంపై రియాక్ట్ అయిన సమంత

admin1
Updated on: 26 Aug 2021 8:00 PM IST
Samantha Akkineni Reacted on Name Changing Instagram and Twitter
X

సమంత అక్కినేని (ఫైల్ ఫోటో)

Samantha Akkineni: "ఏ మాయ చేశావే" సినిమాతో ఆకట్టుకున్న సమంత అక్కినేని టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. నాగచైతన్య ను ప్రేమించి పెళ్లి చేసుకుని అక్కినేని కోడలు గా మారిన సమంత పెళ్లి తర్వాత కూడా మంచి మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎందరికో ఇన్స్పిరేషన్ గా నిలిచారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత పేరు మొన్నటివరకు సమంత అక్కినేని అని ఉండేది. కానీ తాజాగా ఇంస్టాగ్రామ్ లో తన పేరులోని అక్కినేని తీసేసి ఎస్ అనే అక్షరాన్ని మాత్రమే పెట్టుకుంది. ఈ విషయమై ఇప్పటికే బోల్డ్ పుకార్లు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

తాజాగా అనుపమ చోప్రా తో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సమంత అక్కినేని దీనిపై క్లారిటీ ఇచ్చారు. "ఎవరు అడుగుతున్నారు అని కాదు. నాకు నచ్చినప్పుడు మాత్రమే నేను పుకార్లపై రియాక్ట్ అవుతుంటాను. నాకు వివాదాలు అంటే ఇష్టం లేదు. ఎలా అయితే ప్రతి ఒక్కరికి ఎవరికి వారి అభిప్రాయాలు ఉంటాయో, నాకు కూడా అంతే." అని చెప్పిన ఈ రంగస్థలం బ్యూటీ తన పేరును ఎందుకు మార్చుకుందో మాత్రం ఇంకా చెప్పలేదు. ఈ విషయమై సైలెన్స్ మైంటైన్ చేస్తున్న సమంత సినిమాలనుంచి త్వరలో ఒక చిన్న బ్రేక్ తీసుకుంటానని ప్రస్తుతం తన భర్త నాగచైతన్య "లవ్ స్టోరీ" రిజల్ట్ ఎలా ఉండబోతోంది అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చింది సమంత.

admin1

admin1

Next Story