Samantha: మామిడికాయతో సమంతా ఫొటోషూట్... ప్రెగ్నెంట్ అంటూ ప్రచారం!

Samantha Akkineni: 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌తో దేశ వ్యాప్తంగా సమంత పేరు మారుమోగిపోతోంది.

Venkata Chari
Published on: 7 Jun 2021 3:35 PM IST
Samantha Akkineni Pregnant News Goes viral on social Media
X

సమంతా (ఫొటో ఇన్‌స్టాగ్రాం)

Samantha Akkineni: 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌తో దేశ వ్యాప్తంగా సమంత పేరు మారుమోగిపోతోంది. ఈ సిరీస్ ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సమంతా పాత్రపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. కానీ, స్ట్రీమింగ్ అయ్యాక మాత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు వస్తుండడంతో... సమంతా ఫుల్ ఖుషీగా ఉంది. రాజీ పాత్రలో జీవించిందని మెచ్చుకుంటున్నారు. అయితే తాజాగా మరో విషయంలో సమంత సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు.

సమంత 'సాకీ. వరల్డ్' అనే బ్రాండ్‌తో దుస్తుల బిజినెస్‌ చేస్తుంది. అయితే, తాజాగా ఆ దుస్తులు ధరించి ఇన్‌స్టాగ్రామ్‌ లో ఓ ఫోటో షేర్‌ చేసింది. కాగా, ఈ ఫోటోలో సమంతా కంటే మామిడికాయను హైలైట్‌ చేశారు. దీంతో పలువురు నెటిజన్లు నువ్వు తల్లి కాబోతున్నావా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అలాగే ఈ ఫోటోలో సమంతా మరింత క్యూట్‌గా కనిపిస్తుండడంతో.. ఈ వార్తలు నిజమేనంటూ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

ఇలాంటి వార్తలే గతంలోనూ వినిపించాయి. అప్పుడు సమంతా వీటిపై స్పందించి, ఆ వార్తల్లో నిజం లేదంటూ ఖండించింది. అయితే లేటెస్ట్‌ ఫోటో చూస్తే.. సమంతా తల్లి కాబోతున్న వార్తలకు బలం చేకూర్చేలానే ఉన్నాయంటూ ఫ్యాన్స్ తెగ సంబరపపోతున్నారు. మరి ఈ వార్తలపై సామ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. సమంత, నాగచైతన్యలు ప్రేమించుకుని, పెద్దల సమక్షంలో 2017లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

నాగచైతన్యతో పెళ్లి తర్వాత చాలా సెలక్టివ్‌ గా పాత్రలను ఎంచుకొంటోంది సమంత. కేవలం నటనకు ప్రాధాన్యం ఉండే పాత్రలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ప్రస్తుతం గుణశేఖర్ డైరెక్షన్‌లో రానున్న శాకుంతలం సినిమాలో సమంత అక్కినేని నటిస్తుంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నారు.


Venkata Chari

Venkata Chari

Next Story