logo

"చైతు నా లక్కీ చార్మ్" అంటున్న సామ్

"చైతు నా లక్కీ చార్మ్" అంటున్న సామ్
Highlights

టాలీవుడ్ స్టార్ కపుల్ సమంతా, నాగచైతన్య కలిసి నటించిన నాలుగవ సినిమాగా 'మజిలీ' ఏప్రిల్ 5న విడుదల అయిన సంగతి...

టాలీవుడ్ స్టార్ కపుల్ సమంతా, నాగచైతన్య కలిసి నటించిన నాలుగవ సినిమాగా 'మజిలీ' ఏప్రిల్ 5న విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సామ్ మీకు లక్కీ చార్మ్ కదా అని అడిగితే, లేదు చైతూనే నాకు లక్కీ చార్మ్, పెళ్లి తర్వాతే నా నటన, కెరీర్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాయి అని చెప్పుకొచ్చింది సామ్. ఈ సినిమాలో నాగ చైతన్య కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని, మధ్యవయస్కుడు పాత్రలో నాగ చైతన్య నటన పరంగా మంచి వెర్షన్ చూపించాడని సామ్ వెల్లడించింది.

ఇక సూపర్ డీలక్స్ సినిమా గురించి మాట్లాడుతూ చైతన్య, సినిమా ఫస్టాఫ్ మాత్రమే చూశాను కానీ కథ ఆల్రెడీ తెలుసు కాబట్టి పెద్దగా షాకవలేదు అని చెప్పుకొచ్చాడు. ఇక తమిళ సినిమాలు ఎప్పుడు చేస్తారు అని అడుగగా పుట్టి పెరిగింది చెన్నైలోనేనని కాబట్టి తమిళ సినిమాలు అంటే మక్కువ ఎక్కువ అని చెప్పిన చైతన్య ప్రస్తుతం మాత్రం తన దృష్టి మొత్తం తెలుగు సినిమాలపైనే ఉందని క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈ సినిమా విషయంలో చాలా స్ట్రెస్ ఫీలయ్యానని త్వరగా వెకేషన్ కి వెళ్లాలని సమంత పేర్కొంది. మొత్తానికి ఫ్లాపులతో సతమతమవుతున్న నాగచైతన్య కెరీర్లో ఒక మర్చిపోలేని హిట్ 'మజిలీ' సినిమా ద్వారా దక్కింది.


లైవ్ టీవి


Share it
Top