Top
logo

Project K: ప్రభాస్ సినిమాలో కీలక పాత్ర పోషించనున్న సమంత

Samantha Akkineni Likely to Play a key Role in Prabhas Project-K
X

Project K: ప్రభాస్ సినిమాలో కీలక పాత్ర పోషించనున్న సమంత

Highlights

Project K: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు "మహానటి" ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా "ప్రాజెక్ట్ కే".

Project K: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు "మహానటి" ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా "ప్రాజెక్ట్ కే". అయితే ఇది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే. సినిమా టైటిల్ లోని మొదటి అక్షరాన్ని వర్కింగ్ టైటిల్ గా వాడుతున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది. ప్రభాస్ కెరియర్ లో రాబోతున్న మరొక పాన్ ఇండియన్ చిత్రమిది. ఇప్పటికే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ బ్యూటీ దీపిక పడుకొనే ఈ సినిమాతో తెలుగులో కూడా అడుగుపెట్టనుంది.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర తరువాత అంతే ప్రాధాన్యం ఉన్న మరొక స్త్రీ పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పాత్ర కోసం దర్శకనిర్మాతలు స్టార్ బ్యూటీ సమంత ను సంప్రదించినట్లు సమాచారం. అయితే ఇది డీ గ్లామరస్ పాత్ర అని తెలుస్తోంది. ఇప్పటికే "రంగస్థలం", "ఫ్యామిలీ మాన్ సీజన్ 2" లలో డీ గ్లామర్ పాత్రలు పోషించిన సమంత అయితే ఈ పాత్రలో బాగుంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఇప్పటికే మహానటి సినిమాతో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించిన సమంత ఈ సినిమాకు కూడా ఒకే చెప్తుందని అందరూ అనుకుంటున్నారు.

Web TitleSamantha Akkineni Likely to Play a Key Role in Prabhas Project-K Movie
Next Story