Samantha Akkineni: మరో వెబ్ సిరీస్‏లో సమంత

Samantha Akkineni Another Web Series by Netflix
x

సమంత (ట్విట్టర్ ఫోటో)

Highlights

Samantha Akkineni: ఫ్యామిలీ మ్యాన్-2 తో ప్రశంసలు అందుకుంటున్న సమంత మరో వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్లు సమాచారం.

Samantha Akkineni: కరకు చూపులు.. సీరియస్ ఎక్స్ ప్రెషన్..నిజంగా సమంత చంపేసింది తన యాక్షన్ తో ఫ్యామిలీ మ్యాన్-2లో. కేరెక్టర్ లో ఇన్ వాల్వ్ అయిపోయి.. అసలు తానో హీరోయిన్ అన్న సంగతే మర్చిపోయేలా చేసింది. వివాదాలు ఏమో గాని ఈ సిరీస్ రిలీజైన దగ్గర నుంచి సమంతకు ప్రశంసలే ప్రశంసలే. అభిమానులైతే పండగ చేసుకుంటున్నారు. దీంతో సమంత క్రేజ్ పాన్ ఇండియా లెవెల్లో ఓ రేంజ్ లో పెరిగిపోయింది. దీంతో వెబ్ సిరీస్ ఆఫర్లు సమంతాకు ఫుల్లుగా వస్తున్నాయంట. ఓ భారీ వెబ్ సిరీస్ కు ప్లాన్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. అది కూడా నెట్ ఫ్లిక్స్ తో అంట అదింకా సూపర్ కదా.

ఇందుకోసం సమంతకు భారీగానే రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారట. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ బృందం సమంతతో చర్చలు జరిపిందని.. ఈ వెబ్ సిరీస్ చేయడానికి సమంత కూడా ఆసక్తి చూపిస్తున్నట్లుగా టాక్

అన్ని కుదిరితే ఈ వెబ్ సిరీస్ ను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ బడ్జెట్ తో నిర్మించనున్నట్లుగా సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు రానున్నట్లుగా తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories