Tollywood: గోవా కి షిఫ్ట్ ఐపోతున్న టాలీవుడ్ స్టార్ కపుల్

Farmhouse: టాలీవుడ్ లో ఉన్న స్టార్ కపుల్స్ లో నాగచైతన్య మరియు సమంత కి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ.

admin1
Updated on: 18 Aug 2021 9:00 PM IST
Samantha Akkineni and Naga Chaitanya Building Farmhouse in Goa?
X

గోవా కి షిఫ్ట్ ఐపోతున్న టాలీవుడ్ స్టార్ కపుల్

Farmhouse: టాలీవుడ్ లో ఉన్న స్టార్ కపుల్స్ లో నాగచైతన్య మరియు సమంత కి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. కేవలం స్క్రీన్ మీద మాత్రమే కాక ఆఫ్ స్క్రీన్ లో కూడా వారి కెమిస్ట్రీ తో అభిమానులను అలరిస్తారు చై మరియు సామ్. "ఏ మాయ చేసావే" సినిమాతో ఒకరికొకరు పరిచయమై స్నేహితులుగా మారిన నాగచైతన్య మరియు సమంత 2017 లో భార్య భర్తలు గా మారారు. వీరిద్దరికీ గోవా అంటే చాలా ఇష్టం. ఎంత అంటే ఆఖరికి వారి పెళ్లి కూడా అక్కడే జరిగింది. షూటింగ్ మధ్యలో ఎప్పుడు ఖాళీ దొరికినా నాగచైతన్య మరియు సమంత వెళ్ళేది గోవాకే.

అయితే తాజా సమాచారం ప్రకారం చై మరియు సామ్ ఇప్పుడు పర్మినెంట్ గోవా కి షిఫ్ట్ అయిపోదామని ప్లాన్ చేస్తున్నారట. అక్కడే బీచ్ దగ్గరలో ఒక ఫామ్ హౌస్ తీసుకుని స్థిర నివాసం ఏర్పరచు కోవాలి అని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇది కొత్తగా వచ్చిన ప్లాన్ కాదు. ఎప్పటి నుంచో చై మరియు సామ్ గోవా లో సెటిల్ అవ్వాలని కలలు కంటున్నారు. ఇన్నాళ్ళ తర్వాత ఆ కలను నిజం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. 2022 కల్లా వారు గోవా కి షిఫ్ట్ అవుదామని అనుకుంటున్నారట.

admin1

admin1

Next Story