'మజిలీ' హిట్ అవుతుందా అని సందేహపడిన సమంత

మజిలీ హిట్ అవుతుందా అని సందేహపడిన సమంత
x
Highlights

'మజిలి' సినిమాతో ఎట్టకేలకు ఒక మంచి హిట్ అందుకున్నాడు నాగ చైతన్య. నిజానికి పెళ్ళైన తర్వాత సమంత, నాగ చైతన్య కలిసి నటిస్తున్నారు అనగానే ఈ సినిమా పైన...

'మజిలి' సినిమాతో ఎట్టకేలకు ఒక మంచి హిట్ అందుకున్నాడు నాగ చైతన్య. నిజానికి పెళ్ళైన తర్వాత సమంత, నాగ చైతన్య కలిసి నటిస్తున్నారు అనగానే ఈ సినిమా పైన అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సినిమా ఎలా ఉండబోతోందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అనుకున్న విధాగానే సినిమా రిలీజ్ అయిన తొలి రోజే హిట్ టాక్ తెచ్చుకుంది. కెరీర్ స్టార్టింగ్ లో కమర్షియల్ సినిమాలే చేసిన సమంత పెళ్లైన తర్వాత సమంత నటించే స్కోప్ ఎక్కువ ఉన్న పాత్రలు చేస్తోంది.

అయితే సినిమా ఒప్పుకునే ముందే అసలు ఈ సినిమా ఆడుతుందా లేదా అని సమంత కి సందేహాలు కలిగాయంట. "అసలు ఈ కథని నేనే యాక్సెప్ట్ చేశానా అనే డౌట్ కూడా వచ్చింది. ఒకానొక సమయంలో దేవుడి మీదే భారం వేసి ఎలాగైనా సినిమా హిట్ అవ్వాలని టెన్షన్ పడేదాన్ని. మొత్తానికి సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అప్పుడు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను. " అని చెప్పుకొచ్చింది సామ్. చైతూతో పెళ్లైన తర్వాత ఏ విషయాన్ని ఈజీగా తీసుకోలేకపోతున్నానని, 'మజిలీ' సినిమా విషయంలో బాగా టెన్షన్ పడ్డానని చెప్పింది.

Show Full Article
Print Article
Next Story
More Stories