Samantha: మహేష్ తో మళ్లీ జత కట్టనున్న సమంత

Samantha: పూజా హెగ్డే స్థానంలో మహేష్ బాబు తో రొమాన్స్ చేయబోతున్న సమంత

admin1
Published on: 31 Dec 2021 11:39 AM IST
Samantha Acting with Mahesh Babus New Film | Tollywood News
X

మహేష్ తో మళ్లీ జత కట్టనున్న సమంత

Samantha: ఈ మధ్యనే "సరిలేరు నీకెవ్వరు" సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు పరశురామ్ దర్శకత్వంలో "సర్కారు వారి పాట" అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా తరువాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. "అతడు", "ఖలేజా" సినిమాల తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూడో సినిమా ఇది.

ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం పూజ హెగ్డే ను రంగంలోకి దింపినట్లు దర్శక నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. కానీ తాజా సమాచారం ప్రకారం పూజా హెగ్డే డేట్లు కుదరకపోవడంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పూజా హెగ్డే స్థానంలో ఇప్పుడు దర్శకనిర్మాతలు మరొక స్టార్ హీరోయిన్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు స్టార్ బ్యూటీ సమంత. మహేష్ బాబు సరసన పూజా హెగ్డే స్థానంలో సమంత హీరోయిన్ గా కనిపించనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది.

admin1

admin1

Next Story