Samantha - Naga Chaitanya: నాగ చైతన్య సమంత నిజంగానే విడిపోబోతున్నారా?

Samantha - Naga Chaitanya: * సమంత మరియు నాగ చైతన్య త్వరలో విడిపోతున్నారు అంటూ మీడియా మళ్లీ కోడై కూస్తోంది

admin1
Updated on: 26 Sept 2021 9:00 PM IST
Samantha Absent for Akkineni Naga Chaitanya Dinner Party for Amir Khan | Samanta Naga Chaitanya Divorce News
X

సమంత -నాగ చైతన్య (ఫోటో- ది హన్స్ ఇండియా)

Samantha - Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య మరియు సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన "లవ్ స్టోరీ" సినిమా సెప్టెంబర్ 24న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను నమోదు చేసుకుంది. అయితే మరోవైపు నాగచైతన్య మరియు సమంత ల లవ్ స్టోరీ మీద అభిమానులు మరింత ఫోకస్ చేస్తున్నారు. "ఏ మాయ చేశావే" సినిమాతో స్నేహితులు గా మారిన నాగచైతన్య మరియు సమంత 2017 అక్టోబర్ లో పెళ్లి చేసుకుని టాలీవుడ్లోనే స్టార్ కపుల్ గా పిలవబడుతున్నారు.

కానీ సమంత తన సోషల్ మీడియాలో అకౌంట్ లో అక్కినేని పేరు ని తొలగించిన అప్పటి నుంచి నాగచైతన్య మరియు సమంత విడిపోతున్నారు అనే వార్త బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో నాగచైతన్య మరియు సమంత ల మీద కన్నేసిన మీడియా వారిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది. నాగ చైతన్య తాజాగా ఒక డిన్నర్ పార్టీని ఏర్పాటు చేశారు. అందులో నాగార్జున, సాయి పల్లవి, అఖిల్, అమీర్ ఖాన్, అమల మరియు శేఖర్ కమ్ముల ఈ డిన్నర్ పార్టీ కి విచ్చేశారు. కానీ ఇందులో సమంత మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీంతో సమంత మరియు నాగ చైతన్య త్వరలో విడిపోతున్నారు అంటూ మీడియా మళ్లీ కోడై కూస్తోంది. ఏదేమైనా ఈ దంపతులు నోరు విప్పేదాకా ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పడదని చెప్పుకోవచ్చు.

admin1

admin1

Next Story