అక్కినేని హీరోలతో సమంత సినిమా ను కంపేర్ చేస్తున్న అభిమానులు...!

sam beats naga chaitanya collections with yashoda
x

అక్కినేని హీరోలతో సమంత సినిమా ను కంపేర్ చేస్తున్న అభిమానులు

Highlights

* ఈ మధ్య కాలంలో సమంత స్పీడ్ తగ్గినప్పటికీ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదని ఈ సినిమా కలెక్షన్లు చూస్తే అర్థమవుతుంది

Yashoda: గత కొంతకాలంగా కేవలం ఫిమేల్ సెంటర్ మాత్రమే చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది స్టార్ బ్యూటీ సమంత తాజాగా ఇప్పుడు "యశోద" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో తన అద్భుతమైన నటన, ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలతో సమంత మంచి రెస్పాన్స్ అందుకుంది. తాజాగా అభిమానులు "యశోద" సినిమా కలెక్షన్ల ను అభిమానులు అక్కినేని హీరో ల సినిమా కలెక్షన్ల తో కంపేర్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన చర్చలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో "యశోద" సినిమా మొదటి రోజున 5 కోట్ల కలెక్షన్లు నమోదు చేసుకుంది కానీ ఆ కలెక్షన్లు నాగ చైతన్య హీరోగా నటించిన "థాంక్ యూ" సినిమా కలెక్షన్ల కంటే చాలా ఎక్కువ అనే చెప్పాలి.

ఫిమేల్ సెంటర్ సినిమా అయినప్పటికీ సమంత సినిమా ఎక్కువ కలెక్షన్లు నమోదు చేసుకోవడంతో అభిమానులు కూడా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో సమంత స్పీడ్ తగ్గినప్పటికీ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదని ఈ సినిమా కలెక్షన్లు చూస్తే అర్థమవుతుంది. దర్శక ద్వయం హరి మరియు హరీష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ను శివలెంక కృష్ణ ప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, మురళీ శర్మ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. మణి శర్మ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. ఎట్టకేలకు సమంత "యశోద" తో మర్చిపోలేని హిట్ అందుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories