సల్మాన్ ఖాన్ పాత్రకి డబ్బింగ్ చెబుతున్న మెగా హీరో.

సల్మాన్ ఖాన్ పాత్రకి డబ్బింగ్ చెబుతున్న మెగా హీరో.
x
Highlights

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు బాలీవుడ్ లో స్టార్ హీరోలతో సైతం మంచి స్నేహ బంధం ఉంది. ఈ మధ్యనే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు బాలీవుడ్ లో స్టార్ హీరోలతో సైతం మంచి స్నేహ బంధం ఉంది. ఈ మధ్యనే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఏకంగా ఒక వీడియో మెసేజ్ ద్వారా శుభాకాంక్షలు చెప్పిన సంగతి తెలిసిందే. బచ్చన్ కుటుంబంతోనే కాక రామ్ చరణ్ కు సల్మాన్ ఖాన్ తో కూడా మంచి స్నేహ బంధం ఉంది. ఇప్పుడు వారి మధ్య స్నేహాన్ని అందరికీ తెలిసే విధంగా ఒక పనిచేయబోతున్నాడు రామ్ చరణ్. సల్మాన్ ఖాన్ త్వరలో 'భారత్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా తెలుగు భాషల్లో కూడా విడుదల కానుంది. అయితే తెలుగులో ట్రైలర్ కు రామ్ చరణ్ స్వయంగా తన వాయిస్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు, హిందీలో మాత్రమే కాక తమిళంలో కూడా విడుదల కానుంది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దిశా పఠానీ, కత్రినా కైఫ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది రంజాన్ సందర్భంగా విడుదల కానుంది. గతంలో కూడా రామ్ చరణ్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' సినిమా కు డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories