దేవిశ్రీప్రసాద్ కి నో చెప్పిన స్టార్ హీరో

Salman Khan Removes Devi Sri Prasad From Kabhi Eid Kabhi Diwali
x

దేవిశ్రీప్రసాద్ కి నో చెప్పిన స్టార్ హీరో

Highlights

Devi Sri Prasad: "పుష్ప" సినిమాతో దేవి శ్రీ ప్రసాద్ ప్యాన్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయారు.

Devi Sri Prasad: "పుష్ప" సినిమాతో దేవి శ్రీ ప్రసాద్ ప్యాన్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయారు. స్టార్ హీరోల సినిమాలకి బాగానే సంగీతాన్ని అందిస్తున్న దేవిశ్రీప్రసాద్ చిన్న సినిమాలకు మాత్రం అంతగా న్యాయం చేయలేకపోతున్నాడు అని ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. సుకుమార్ కాంపౌండ్ లో ఉన్నంతసేపు మాత్రమే దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ చాలా బాగుంటుందని కామెంట్ కూడా వినిపిస్తూనే ఉంటుంది.

అయితే తాజాగా ఒక స్టార్ హీరో దేవిశ్రీప్రసాద్ ని రిజెక్ట్ చేయడం అభిమానులకు షాక్ ఇచ్చింది. ఆ హీరో మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్. "పుష్ప" సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఉర్రూతలూగించిన దేవిశ్రీప్రసాద్ మీద సల్మాన్ ఖాన్ కు ఎప్పటినుంచో మంచి అభిప్రాయం ఉంది. అతను కంపోజ్ చేసిన 'రింగ రింగా' పాట తన "రెడీ" సినిమాలో కూడా పెట్టుకున్నారు సల్మాన్.

ఒక సినిమాలో ఒకటి రెండు పాటలు మీద వర్క్ చేసే ఆఫర్లు దేవిశ్రీప్రసాద్ కి చాలానే వచ్చాయి. అలానే సల్మాన్ ఖాన్ కూడా తన సినిమాలకి ఒకటి లేదా రెండు పాటలు కంపోజ్ చేయమని ఆఫర్ ఇచ్చారు కానీ దేవిశ్రీప్రసాద్ మాత్రం ఇలా సగం పనులు చేయలేను అంటూ ఆ సినిమాని రిజెక్ట్ చేశారు. అయితే తాజాగా సల్మాన్ ఖాన్ "కభీ ఈద్ కభీ దివాళి" సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ అన్నీ రెడీ చేస్తుండగా సల్మాన్ ఖాన్ మాత్రం దేవి అవసరం లేదని నిర్మాతలకి మొహం మీద చెప్పేశారట.

Show Full Article
Print Article
Next Story
More Stories