Tollywood: రామ్‌చరణ్‌ మూవీలో బాలీవుడ్ టాప్ హీరో

Tollywood:శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా ఓ ప్యాన్‌ ఇండియా మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

Samba Siva Rao
Updated on: 12 April 2021 8:54 AM IST
Salman Khan, Ram Charan and Shankar Film
X

రాంచరణ్ సల్మాన్ ఫైల్ ఫోటో 

Tollywood: మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాతో బీజీగా ఉన్నా సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాల తర్వాత చెరణ్ హీరోగా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా బాలీవుడ్‌ భాయ్‌ సల్మాన్‌ ఖాన్‌ నటిస్తున్నారని ప్రచారం సాగుతుంది. అయితే ప్రచారం నిజమే అనే వార్తలు బలపరుస్తున్నాయి.

పూర్తి వివరాళ్లోకి వెళ్లే.. శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా ఓ ప్యాన్‌ ఇండియా మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.'దిల్‌' రాజు నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్‌ సినిమా జూలైలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో ఎంతో ప్రాధాన్యం ఉన్న ఓ పాత్రను చిరంజీవితో చేయించాలనే ఆలోచనలో ఉన్నారట.. చిరంజీవికి వీలుకాని పక్షంలో..ఇదే పాత్రను హిందీలో సల్మాన్‌ఖాన్‌తో చేయించాలనుకుంటున్నారట.

చిరంజీవికి సల్మాన్‌ ఖాన్‌ల మధ్య పరిచాయలు ఉన్నాయి. చిరంజీవి అడిగితే సల్మాన్ భాయ్ కాదనకపోవచ్చు. ఈ నేపథ్యంలో చరణ్ మూవీలో సల్మాన్‌ఖాన్‌ నటించే అవకాశాలు లేకపోలేదని సమాచారం‌. పైగా కథకి ఎంతో ప్రాధాన్యం ఉన్న పాత్ర కావడంతో సల్మాన్ ఖాన్ నటించే అవకాశం లేకపోదని తెలుస్తోంది. అయితే ఇప్పటికే శంకర్ కథ చెప్పి సల్మాన్ ఖాన్ కు ఒప్పించారని ఇండస్గ్రీలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. తర్వలోనే అధికారిక ప్రకటన చేస్తారని తెలుస్తోంది.

ప్రస్తుతం రామ్ చరణ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్నాడు. ఈ ఏడాది అక్టోబర్ లో విడుదల కానున్న ఈ మూవీలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ కనిపించనున్నారు. మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీకి హీరోగా చెస్తున్న సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో చెర్రీకి సంబందించిన లూక్ రిలీజ్ చేశారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story