Salman Khan: హిట్ సినిమా తీసెందుకు ఏ ఫార్ములా లేదు

Salman Khan: సౌత్ డామినేషన్ పై బాలీవుడ్ లో అభద్రతభావం కూడా లేదు

Rama Rao
Updated on: 26 July 2022 1:35 PM IST
Salman Khan On Promoting Kiccha Sudeeps Vikrant Rona
X

Salman Khan: హిట్ సినిమా తీసెందుకు ఏ ఫార్ములా లేదు

Salman Khan: కొద్ది రోజుల క్రితం నాగార్జున ,తనకు హిట్ సినిమా తీయటం ఎలాగో ఇంకా అర్దం కావట్లేదని మీడియా కు చెప్పారు. ‌తనకే కాదు అందరికీ ఒక సినిమా హిట్టా, ప్లాపా అనేది ముందుగానే తెలీసె అవకాశం లేదన్నారు .ఇప్పుడు అదే విషయాన్ని సల్మాన్ కూడా ప్రస్తావించాడు. సుదీప్ లేటెస్ట్ మూవీ విక్రాంత్ రోనా ప్రచారంలో సల్మాన్ హంగామా చేశాడు.‌ అక్కడే సౌత్ ఇండస్ట్రీ బాలీవుడ్ ను డామినేట్ చేస్తోందనే విషయంపై సల్మాన్ ఖాన్ ఆసక్తికరంగా స్పందించాడు.

అందరూ అనుకున్నట్లు బాలీవుడ్ లో సౌత్ వల్ల ఎలాంటి అభద్రతాభావం లేదన్నాడు‌.‌ఇతర భాషాల నటీ నటులతో కలిసి పని చేయడం అనేది ఎల్లప్పుడూ ఉంటుందన్నాడు. అయితే ఇటీవలి కాలంలో అది కాస్త ఆగిపోయిందని‌. కానీ తాను కెరీర్ లో సౌత్ లోని ప్రతిభావంతులతో కలిసి పని చేస్తున్నట్లు తెలిపాడు.సుదీప్, ప్రకాష్ రాజ్, ప్రభుదేవా తో పనిచేశానని. సౌత్ డైరెక్టర్లు డిఓపిలతో పని చేస్తునట్లు . ప్రస్తుతం తాను వెంకటేష్తో కలిసి వర్క్ చేస్తున్నట్లు సల్మాన్ తెలిపాడు.బాలీవుడ్ లో వెంకటేష్ మొదటి చిత్రం 'అనారి' భారీ విజయాన్ని సాధించిందని గుర్తు చేశారు.

అలాగే కమల్ హాసన్ కూడా తమ మార్క్ బాలీవుడ్ లో చూపించారన్నాడు. ప్రతి ఇండస్ట్రీ పెద్ద సినిమాలు తీయాలని ప్రయత్నిస్తుందని కానీ దానికి ఫార్ములా అంటూ ఉండదని సల్మాన్ అన్నాడు. తామంతా పెద్ద సినిమాలు తీయాలని ప్రయత్నిస్తాం. కొన్నిసార్లు అవి వర్కౌట్ అవుతాయి కొన్నిసార్లు కావు . కాబట్టి విజయవంతమైన చిత్రానికి ఫిక్స్ డ్ ఫార్ములా లేదంటూ సల్మాన్ క్లారిటి ఇచ్చేశాడు. సుదీప్ సైతం సల్మాన్ లాంటి వారు సౌత్ సినిమాలకు సపోర్ట్ చేస్తున్నారని, చిరంజీవి కోసం సల్మాన్ హైదరాబాదు వస్తున్నారని తెలిపాడు.

Rama Rao

Rama Rao

Next Story