Salaar: భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సలార్

Salar Is Doing Huge Pre Release Business
x

Salaar: భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సలార్

Highlights

Salaar: ఓవర్సీస్ థియట్రికల్ రైట్స్ తో షాక్ ఇచ్చిన ప్రభాస్ సినిమా

Salaar: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రముఖ కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా "సలార్". శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన ప్యాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా దర్శక నిర్మాతలు కలిసి ప్రస్తుతం సినిమా థియట్రికల్ డీల్స్ ను క్లోజ్ చేసే పనిలో పడ్డారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఉత్తర అమెరికాలోని ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమా ఏకంగా 100 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాకి పది మిలియన్ డాలర్లను బ్రేక్ ఈవెన్ పాయింట్ గా నిర్దేశించారు. అంటే సినిమా హిట్ అవ్వాలి అంటే పది మిలియన్ డాలర్ల కలెక్షన్లు వెనక్కి తీసుకురాగలగాలి. ఇప్పటిదాకా ఈ రేంజ్ లో ఓవర్సీస్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మొదటి సినిమా "సలార్". కేవలం తెలుగులో మాత్రమే కాక ఈ సినిమా తమిళ్ హిందీ కన్నడ మరియు మలయాళం భాషల్లో కూడా విడుదల కాబోతోంది.

ఈ సినిమా రన్ టైం ఏకంగా మూడు గంటలు ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి కానీ అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సిందే. ఇక ఈ సినిమా షూటింగ్ ని ఈ ఏడాది మేకల పూర్తి చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. అంతేకాకుండా ఈ సినిమా రెండవ భాగం మూడేళ్ల తర్వాత అంటే 2026లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories