సలార్ మూవీ బిగ్‌ అప్‌డేట్‌.. ఇక డార్లింగ్ ఫ్యాన్స్‌కు పూనకాలే..!

* ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 85% పూర్తయింది. ఇక వచ్చే ఏడాది ఈ జనవరికి సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిపోతుంది

R Tripura Malini
Updated on: 24 Dec 2022 5:00 PM IST
Salaar Is Going To Break The Records Says The Producer
X

సలార్ సినిమా రికార్డులు బద్దలు కొడుతుంది అంటున్న నిర్మాత

Hombale Films: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు "కేజిఎఫ్" ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత నీల్ కాంబినేషన్లో త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సినిమా "సలార్". హొంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందుర్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ నిర్మాత విజయ్ కిరగందుర్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

"బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో రికార్డులు సృష్టించగల సత్తా సలార్ సినిమాకి ఉంది," అని అన్నారు. ఇక హోంబలే ఫిల్మ్స్ పతాకం పై విజయ్ ఇంతకుముందు కేజిఎఫ్, కేజీఎఫ్ చాప్టర్ 2, కాంతారా వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించిన సంగతి తెలిసిందే. వీరి బ్యానర్లో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "సలార్". "ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 85% పూర్తయింది. ఇక వచ్చే ఏడాది ఈ జనవరికి సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిపోతుంది. ఆ తర్వాత ఆరు నెలలు విజువల్ ఎఫెక్ట్స్ కి పడుతుంది. సెప్టెంబర్ 28 సినిమాని థియేటర్లలో విడుదల చేస్తాము," అని అన్నారు విజయ్ కిరగందుర్.

కన్నడలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన హొంబలే ఫిలిమ్స్ వారికి తెలుగులో ఇదే మొదటి సినిమా. ప్రముఖ మలయాళం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో ముఖ్య విలన్ పాత్రలో కనిపించనున్నారు. "ఇది ఒక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమా. ప్రభాస్ మరియు పృథ్వీరాజ్ చాలా బాగా నటించారు," అని వారిపై ప్రశంసల వర్షం కురిపించారు విజయ్ కిరగందుర్.

R Tripura Malini

R Tripura Malini

Next Story