పుష్ప-2 క్రేజీ అప్‌ డేట్.. అల్లు అర్జున్ కోసం హాలీవుడ్ నటుడిని దింపుతున్న సుకుమార్..

Sajjad Delafrooz in Allu Arjun Starrer Pushpa 2
x

పుష్ప-2 క్రేజీ అప్‌ డేట్.. అల్లు అర్జున్ కోసం హాలీవుడ్ నటుడిని దింపుతున్న సుకుమార్..

Highlights

Pushpa 2: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో నటించిన "పుష్ప" బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే.

Pushpa 2: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో నటించిన "పుష్ప" బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి రెండవ భాగమైన "పుష్ప: ది రూల్" గురించి అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక విలన్ పాత్ర కోసం ఫారెన్ యాక్టర్ ని రంగంలోకి దింపుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

అతనే సజ్జాద్ దెలాఫ్రూజ్. గతంలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన "టైగర్ జిందా హై" సినిమాలో టెర్రరిస్ట్ అబు ఉస్మాన్ పాత్రలో కనిపించిన నటుడు తన పర్ఫామెన్స్ కి మంచి మార్కులు వేయించుకున్నాడు. ఈ మధ్యనే హాట్ స్టార్ లో హిట్ అయిన స్పెషల్ ఆప్స్ అనే వెబ్ సిరీస్ లో కూడా ఇక్లాఖ్ ఖాన్ పాత్రలో కనిపించారు. ఇరాన్ లో పుట్టి యూఏఈ లో పెరిగిన సజ్జాద్ హాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలలో నటించారు.

ప్రస్తుతం సుకుమార్ "పుష్ప: 2" సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా మంచి పేరున్న నటీనటులను ఎంపిక చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సజ్జాద్ ని ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం ఎంపిక చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం "పుష్ప: ది రూల్" షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ నల్లమల అడవుల్లో డాన్ గా మారతాడని అక్కడ కొంతమంది గ్యాంగ్‌స్టర్లతో కలిసి ప్రపంచవ్యాప్తంగా ఎర్రచందనాన్ని అమ్మడానికి ప్రయత్నాలు చేస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. స్టార్ బ్యూటీ రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories