Actress: 7వ తరగతిలోనే హీరోయిన్.. 13 ఏళ్లకే బాక్సాఫీస్ రికార్డులు బద్దలు.. ఎవరీ బ్యూటీ..?

Actress: 7వ తరగతిలోనే హీరోయిన్.. 13 ఏళ్లకే బాక్సాఫీస్ రికార్డులు బద్దలు.. ఎవరీ బ్యూటీ..?
x
Highlights

Actress : ప్రస్తుతం టాలీవుడ్‌లో చిన్న సినిమాల హవా నడుస్తోంది. నటీనటుల కంటే కథనే నమ్ముకుని వస్తున్న చిత్రాలను ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

Actress : ప్రస్తుతం టాలీవుడ్‌లో చిన్న సినిమాల హవా నడుస్తోంది. నటీనటుల కంటే కథనే నమ్ముకుని వస్తున్న చిత్రాలను ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో, సుమారు తొమ్మిదేళ్ల క్రితం కేవలం 13 ఏళ్ల వయసులో హీరోయిన్‌గా పరిచయమై, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒక నటి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆ సినిమా మరేదో కాదు.. మరాఠీ సెన్సేషన్ 'సైరత్' (Sairat).

13 ఏళ్లకే స్టార్‌డమ్.. 7వ తరగతిలోనే హీరోయిన్‌గా!

2016లో విడుదలైన 'సైరత్' సినిమా భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాలో 'ఆర్చీ పాటిల్' అనే పవర్‌ఫుల్ పాత్రలో నటించిన రింకు రాజ్‌గురు, తన తొలి చిత్రంతోనే ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయింది.

ఈ సినిమా షూటింగ్ సమయంలో రింకు వయసు కేవలం 13 ఏళ్లు. అప్పుడు ఆమె 7వ తరగతి చదువుతోంది. రింకును మొదటిసారి చూసిన దర్శకుడు నాగరాజ్ మంజులే, ఆమెలోని ప్రతిభను గుర్తించి సరిగ్గా ఏడాది తర్వాత ఈ సినిమాను పట్టాలెక్కించారు. చిన్న వయసులోనే పరిణతి చెందిన నటనతో రింకు అందరినీ కట్టిపడేసింది.

తొమ్మిదేళ్ల తర్వాత కూడా అదే క్రేజ్!

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. హిందీలో జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో 'ధడక్' పేరుతో రీమేక్ చేసినప్పటికీ, ఒరిజినల్ 'సైరత్' అందించిన ఇంపాక్ట్ మాత్రం రాలేదు.

విశేషం ఏమిటంటే, 2025 మార్చిలో ఈ సినిమాను మళ్ళీ థియేటర్లలో విడుదల చేయగా, 9 ఏళ్ల తర్వాత కూడా ప్రేక్షకులు దీనికి నీరాజనాలు పట్టారు. ఇప్పటికీ ఈ సినిమా క్రేజ్ తగ్గలేదని నిరూపితమైంది.

ప్రస్తుతం రింకు ఎలా ఉంది?

గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ, కేవలం కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటూ రింకు ముందుకు సాగుతోంది. నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఇటీవలే 'ఆశా' అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories