Adipurush: ప్రభాస్ అభిమానులకు శుభవార్త.. లంకేష్ షూటింగ్ పూర్తయింది అంటున్న ఓం రౌత్

Adipurush: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా "ఆది పురుష్".

admin1
Published on: 9 Oct 2021 5:01 PM IST
Saif Ali Khan Completed Shooting for his Upcoming Film Adiprush
X

Adipurush: ప్రభాస్ అభిమానులకు శుభవార్త.. లంకేష్ షూటింగ్ పూర్తయింది అంటున్న ఓం రౌత్

Adipurush: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా "ఆది పురుష్". రామాయణం ఆధారంగా తెరకెక్కనున్న ఈ మైథలాజికల్ డ్రామా కి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ కనిపించబోతుండగా, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీత పాత్రలో, రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్ట్ 11 విడుదలకి సిద్ధమవుతున్నట్లుగా చిత్రబృందం తాజాగా ప్రకటించింది.

తాజాగా ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ పాత్ర షూటింగ్ పూర్తయినట్లు గా దర్శకుడు ఓం రౌత్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. "లంకేశ్ షూటింగ్ పూర్తయింది. నీతో పని చేయడం చాలా బావుంది SAK" అంటూ సైఫ్ అలీఖాన్ తో దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేశారు ఓం రౌత్. అయితే సినిమాలో పాత్రల లుక్స్ మాత్రం బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు చిత్రబృందం. టీ సిరీస్ మరియు రెట్రో ఫైల్స్ సంయుక్తంగా నిర్మించిన "ఆది పురుష్" సినిమాకి సాచెత్-పరంపర సంగీతాన్ని అందించారు.

admin1

admin1

Next Story