Jr NTR: ఎన్టీఆర్ సినిమాలో విలన్ గా ఎవరంటే..

Jr NTR: ఎన్టీఆర్‌ హీరోగా త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.

Venkata Chari
Published on: 29 March 2021 9:00 PM IST
saif ali khan as a Vilan in Jr NTR New Movie
X

ఎన్టీఆర్ (ఫైల్ ఫొటో)

Jr NTR: ఎన్టీఆర్‌ హీరోగా త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, యన్.టి.ఆర్. ఆర్ట్స్ కాంబోలో నిర్మిస్తున్న ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ కనిపించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. సైఫ్‌ అలీ ఖాన్‌ ప్రస్తుతం ప్రభాస్‌ 'ఆదిపురుష్‌' చిత్రంలో రావణుడిగా నటిస్తున్నారు.

'ఎన్టీఆర్‌ 30' గా పిలిచే ఈ సినిమాకి 'చౌడప్ప నాయుడు', 'అయినను పోయి రావలె హస్తినకు' వంటి టైటిల్స్ ను మేకర్స్ పరిశీలిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇక హీరోయిన్ గా రష్మిక మందాన్న, పూజా హెగ్డేల పేర్లు వినిపిస్తున్నాయి. వీరేకాక బాలీవుడ్ నుంచి జాన్వీ కపూర్‌ - ఎన్టీఆర్‌ చిత్రంలోనే టాలీవుడ్ లో పరిచయం కానుందనే వార్తలు అప్పట్లో వైరలయ్యాయి.

ప్రస్తుతం ఎన్టీఆర్‌, రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' చిత్రంలో కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రానున్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుద‌ల కానుంది.



Venkata Chari

Venkata Chari

Next Story