Sarkaru Vaari Paata: ముసుగేసుకుని ప్రేక్షకుల మధ్యలో సినిమా చూసిన సాయిపల్లవి!

Sarkaru Vaari Paata: సినిమా స్టార్స్, సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి రావడానికి నానా తంటాలు పడతారు.

Arun Chilukuri
Updated on: 16 May 2022 9:00 PM IST
Sai Pallavi’s Secret Visit to Sarkaru Vaari Paata Movie
X

Sarkaru Vaari Paata: ముసుగేసుకుని ప్రేక్షకుల మధ్యలో సినిమా చూసిన సాయిపల్లవి!

Sarkaru Vaari Paata: సినిమా స్టార్స్, సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి రావడానికి నానా తంటాలు పడతారు. ఎవరి కంటైనా పడితే చాలు జనాలు వారిని చుట్టు ముట్టేస్తారు. అందుకే సెలబ్రెటీల లైఫ్ చాలా ప్రైవేటుగా మారిపోతుంది. తాజాగా ఇలాంటిదే మరో ఉదాహరణ వెలుగులోకి వచ్చింది. నేచురల్ బ్యూటీ సాయిపల్లవి ఓ సినిమా చూడటానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. మహేష్‌బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట చిత్రాన్ని చూసేందుకు సాయి పల్లవి ముసుగు వేసుకొని, ఎవరి కంటా పడకుండా వెళ్లొచ్చింది. మాస్క్ ధరించి, ఫోన్ మాట్లాడుతూ, ఎవరూ చూడకుండా జాగ్రత్త పడుతూ హైదరాబాద్‌లోని పీవీఆర్ ఆర్కే సినిప్లెక్స‌ నుంచి బయటకు వచ్చి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story