Sai Pallavi: 'అనుకోని అతిథి' ట్రైలర్.. మరోసారి 'ఫిదా' అవ్వాల్సిందే..

Anukoni Athidhi Trailer: కోవిడ్ దెబ్బకు థియేటర్లు మూతపడడంతో... ఓటీటీలకు డిమాండ్ పెరిగింది.

Venkata Chari
Updated on: 25 May 2021 7:45 PM IST
Sai Pallavis Anukoni Athidhi Trailer Released
X

అనుకోని అతిథిలో సాయిపల్లవి (ఫొటో ట్విట్టర్)

Anukoni Athidhi Trailer: కోవిడ్ దెబ్బకు థియేటర్లు మూతపడడంతో... ఓటీటీలకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో వెబ్ సిరీస్‌లు, పలు సినిమాలను ఓటీటీల్లో రిలీజ్ చేస్తూ... ఇంట్లోనే ప్రేక్షకులకు వినోదం అందించేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఫహ‌ద్ ఫాజిల్, సాయి ప‌ల్ల‌వి కాంబోలో మ‌ల‌యాళ సైకలాజికల్ థ్రిల్లర్‌ 'అతిరన్‌'సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను తెలుగులో 'అనుకోని అతిథి'గా రీమేక్ చేసి ఓటీటీలో విడుదల చేయనున్నారు. మే 28 నుంచి ఆహా లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

కాగా, ఇప్పటికే విడుదలైన 'అనుకోని అతిథి' టీజ‌ర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌లో ప్ర‌తీ సీన్ ఉత్కంఠభరితంగా మలిచారు. మానసిక సమస్యతో బాధపడే పాత్రలో ఫిదా ఫేమ్ సాయిపల్లవి నటన ఆకట్టుకుటుంది. ఓ బంగ్లా నేప‌థ్యంలో వ‌చ్చే సీన్స్, బీజీఎం సినిమాపై ఆసక్తిని అమాంతం పెంచేశాయి.

సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా రానున్న ఈ సినిమాను డైరెక్టర్ వివేక్ తెర‌కెక్కించాడు. ఈ సినిమాలో ప్ర‌కాశ్ రాజ్‌, అతుల్ కుల‌క‌ర్ణి, రెంజి పానికర్‌, లియోనా లిషోయ్‌, శాంతికృష్ణ కీలక పాత్రల్లో నటించారు. సంగీతం జిబ్రాన్ అందించాడు. సాయి పల్లవి డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపించనుండటంతో సినిమా చూడాలనే ఆతృత పెంచేసింది.

Venkata Chari

Venkata Chari

Next Story