Sai Pallavi Turns Chiranjeevi's Sister : మెగాస్టార్ కి చెల్లెలుగా సాయి పల్లవి?

Sai Pallavi Turns Chiranjeevi's Sister : మెగాస్టార చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే..

Krishna
Published on: 11 Sept 2020 10:58 AM IST
Sai Pallavi Turns Chiranjeevis Sister : మెగాస్టార్ కి చెల్లెలుగా సాయి పల్లవి?
X

Chiranjeevi, Sai Pallavi

Sai Pallavi Turns Chiranjeevi's Sister : మెగాస్టార చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని ఇది చిరంజీవికి 152వ చిత్రం కావడం విశేషం.. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో చిరు సరసన కాజల్ అగర్వాల్ కథానాయకగా నటిస్తోంది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం వలన సినిమా వాయిదా పడింది.

అయితే ఈ సినిమా తరవాత వరుసపెట్టి సినిమాలను చేసేందుకు చిరు రెడీ అవుతున్నారు.. ఇప్పటికే లూసిఫర్ రీమేక్ హక్కులను తీసుకున్న చిరు ఈ కథకి సంబంధించిన మార్పులను చేస్తున్నారు. అంతేకాకుండా తమిళ్ లో అజిత్ నటించిన 'వేదాళం' రీమేక్‌లో నటిస్తున్నారు. దీనిని మెహర్ రమేష్ దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం నటి సాయి పల్లవిని సంప్రదిస్తున్నారని సమాచారం..

తమిళ వేదాళంలో అజిత్‌ చెల్లిగా లక్ష్మీమీనన్‌ నటించింది. ఆమె పాత్రకి మంచి పేరు వచ్చింది అక్కడ.. ఇప్పుడు ఆ పాత్రకి సాయి పల్లవి అయితే సరిగ్గా సరిపోతుందని మేకర్స్ భావిస్తున్నారట మేకర్స్.. అటు సాయిపల్లవి కూడా ఈ పాత్ర చేయడం పట్ల ఆసక్తిగా ఉందని చెబుతున్నారు. దీనిపైన ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.. ఇక ప్రస్తుతం సాయిపల్లవి తెలుగులో నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న లవ్ స్టొరీ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

Krishna

Krishna

Next Story