సూర్య ని బాగా ఇబ్బంది పెట్టిన సాయి పల్లవి

Ruthvik
Published on: 1 May 2019 12:34 PM IST
సూర్య ని బాగా ఇబ్బంది పెట్టిన సాయి పల్లవి
X

అతి తక్కువ సమయంలోనే మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది సాయిపల్లవి. ఈ మధ్యనే తెలుగులో 'పడి పడి లేచే మనసు' అనే సినిమాతో డిజాస్టర్ అందుకున్న ఈమె ఇప్పుడు తాజాగా సూర్య సరసన 'ఎన్జీకే' సినిమాలో నటించింది. మే 31న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్ర ట్రైలర్ ను ఈ మధ్యనే విడుదల చేశారు. ఈ ట్రైలర్ విడుదల వేడుకలో మాట్లాడుతూ సాయి పల్లవి సూర్య పై ప్రశంసల వర్షం కురిపించింది. "నేను సూర్య గారికి వీరాభిమాని షూటింగ్ సమయంలో ఆయనను గమనిస్తూ ఉండేదాన్ని ఆయన ఏం చేసినా నా దృష్టి ఎప్పుడూ ఆయన మీద మాత్రమే ఉండేది" అని చెప్పింది సాయి పల్లవి.

"సెట్ లో సూర్య అందరితో కలివిడిగా మాట్లాడుతూ ఉంటారు. కానీ షాట్ రెడీ అనగానే ఆయన సీరియస్ నెస్ ఇలా అన్ని గమనించేదాన్ని. నేను మరో 20 ఏళ్లు సినిమాలు చేసినా కూడా ఆయన అంత కష్ట పడలేను. ఆయన ఏ పాత్ర అయినా ఇట్టే ఒదిగిపోతారు. అలాంటి వ్యక్తితో నటించడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఒక సీన్ కోసం 50 టేకులు తీసుకోవాల్సి వచ్చింది. కానీ అప్పుడు కూడా సూర్య గారు విసుక్కోకుండా నేను ఇబ్బంది పడకుండా చూస్తున్నారు. షూటింగ్ సమయంలో సూర్య గారు నా వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. అయినా కూడా ఆయన ఎప్పుడు నాపై కోపం తెచ్చుకోకుండా ఓపికగా ఉన్నారు" అని చెప్పుకొచ్చింది సాయి పల్లవి.

Ruthvik

Ruthvik

Next Story