Sai Pallavi - Nagarjuna: "మా తాతయ్యకి ఆయనెప్పుడూ అన్నమయ్యే"

* "నాగార్జున సినిమా వస్తే ఛానల్ మార్చేస్తాను" అంటున్న సాయి పల్లవి * నాగార్జున ఈ వేడుకకి ముఖ్య అతిథిగా విచ్చేసారు

admin1
Updated on: 29 Sept 2021 8:45 PM IST
Sai Pallavi Speaks about Nagarjuna in Love Story Success Meet
X

లవ్ స్టోరీ సక్సెస్ మీట్ (ట్విట్టర్ ఫోటో)

Sai Pallavi - Nagarjuna: అక్కినేని నాగచైతన్య మరియు సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన "లవ్ స్టోరీ" సినిమా ఈ మధ్యనే సెప్టెంబర్ 24న థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒక సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసింది చిత్రబృందం. నాగార్జున కూడా ఈ వేడుకకి ముఖ్య అతిథిగా విచ్చేసారు.

ఈ వేడుకలో మాట్లాడుతూ సాయి పల్లవి నాగార్జున గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. "సక్సెస్ మీట్ కి వచ్చినందుకు నాగార్జున గారికి ధన్యవాదాలు. మీరు ప్రీ రిలీజ్ కి వస్తే అక్కడ చెబుదాం అనుకున్నాను," అని మొదలు పెట్టింది సాయి పల్లవి.

"మా తాతయ్య అన్నమయ్య సినిమాని వంద సార్లు చూసి ఉంటారు. ఆయనతో కలిసి మేము కూడా చాలా సార్లు మీ సినిమా చూసాము. చిన్నప్పట్నుంచి మీరంటే చాలా ఇష్టం మరియు అభిమానం ఏర్పడింది. అన్నమయ్య సినిమా చూసి తాతయ్య ఏడుస్తుంటే, 'ఆయన నటిస్తున్నారు తాతయ్య, ఏడవకు' అన్నాను.

అప్పుడు మా తాతగారు 'ఇప్పుడు నటిస్తూ ఉండొచ్చు కానీ గత జన్మలో నాగార్జున ఖచ్చితంగా యోగి అయ్యి ఉంటారు' అని అన్నారు. అప్పటి నుంచి మీ సినిమాలు టీవీలో వచ్చినా ఛానల్ మార్చేస్తాను. ఎందుకంటే తాతయ్య దృష్టిలో మీరు ఎప్పుడూ అన్నమయ్యే," అని చెప్పుకొచ్చింది సాయి పల్లవి.

admin1

admin1

Next Story