Pooja Kannan: హీరోయిన్ గా మారబోతున్న సాయి పల్లవి చెల్లెలు

Pooja Kannan - ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్న సాయి పల్లవి చెల్లెలు

admin1
Updated on: 24 Nov 2021 4:58 PM IST
Sai Pallavi Sister Pooja Kannan Making her Debut Film Chithirai Sevvanam which Releases on 04th December 2021
X

Sai Pallavi Sister Pooja Kannan (Photo: Instagram)

Sai Pallavi Sister Pooja Kannan: మలయాళంలో "ప్రేమమ్" సినిమాతో క్రేజ్ అందుకున్న హీరోయిన్ సాయి పల్లవి "ఫిదా" సినిమాతో తెలుగు లో కూడా అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ఆ తర్వాత కూడా ఎంసీఏ వంటి మంచి హిట్ సినిమాల లో కనిపించిన సాయి పల్లవి ఈ మధ్యనే నాగ చైతన్య హీరోగా నటించిన "లవ్ స్టోరీ" సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇక తాజాగా సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.

సిల్వర్ స్టంట్ దర్శకత్వం వహిస్తున్న "సెవ్వానం" అనే సినిమాలో హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతోంది పూజ. రిమా కల్లింగల్ మరియు కని తొండన్ ఈ సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డైరెక్టర్ విజయ్ కథని అందించిన ఈ సినిమా డిసెంబర్ 3న జీ 5 తమిళ్ లో విడుదల కాబోతుంది. తన అద్భుతమైన నటన మరియు డాన్స్ తో సాయి పల్లవి ఇప్పటికే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. ఇక పూజ ఎంత వరకు ప్రేక్షకులను అలరిస్తుందో వేచి చూడాలి

admin1

admin1

Next Story