దర్శకుడితో ప్రేమలో పడిన 'ఫిదా' బ్యూటీ

Ruthvik
Published on: 26 March 2019 4:51 PM IST
దర్శకుడితో ప్రేమలో పడిన ఫిదా బ్యూటీ
X

మలయాళం 'ప్రేమమ్' సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సాయి పల్లవి 'ఫిదా' సినిమాతో తెలుగు ప్రేక్షకులను నిజంగానే ఫిదా చేసేసింది. ఆ తరువాత 'ఎంసీఏ' సినిమాతో మరొక సూపర్ హిట్ ను నమోదు చేసుకున్న సాయి పల్లవి ఈమధ్యనే 'పడి పడి లేచే మనసు' అనే సినిమాలో కనిపించింది కానీ ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తాజాగా సాయి పల్లవి కోలీవుడ్ డైరెక్టర్ ఎఎల్ విజయ్ ను త్వరలో వివాహం చేసుకోబోతోంది అంటూ కోలీవుడ్ మీడియా కోడైకూస్తోంది. విజయ్ ఇంతకుముందు హాట్ బ్యూటీ అమలా పాల్ ని పెళ్లి చేసుకుని కొన్ని నెలలకే విడాకులు తీసుకున్నాడు.

ఆయనే సాయి పల్లవి నటించిన 'కణం' సినిమాకు దర్శకత్వం వహించింది. ఆ సినిమా అదే సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, అది పెళ్లికి దారి తీయబోతోంది అని కోలీవుడ్ వర్గాల బోగట్టా. అయితే అటు విజయ్ కానీ ఇటు సాయిపల్లవి కాని ఈ వార్తలపై క్లారిటీ ఇవ్వలేదు. కానీ సాయి పల్లవి ఫ్యాన్స్ మాత్రం అవి కేవలం పుకార్లు మాత్రమే అయి ఉంటాయి అంటూ కొట్టిపారేస్తున్నారు. ఏదిఏమైనా అటు సాయిపల్లవి లేదా విజయ్ వీరిద్దరిలో ఎవరో ఒకరు స్పందించనిదే ఈ వార్తలకు ముగింపు పడదు.

Ruthvik

Ruthvik

Next Story