Sai Pallavi: కామెడీ పాత్రలలో నటించాలని ఉంది అంటున్న సాయి పల్లవి

Sai Pallavi: కామెడీ పాత్రలు చేయాలని ఉంది అంటున్న స్టార్ హీరోయిన్

admin1
Updated on: 9 Nov 2021 5:30 PM IST
Sai Pallavi Says she Wants to Act in Comedy Roles
X

సాయి పల్లవి (ఫోటో టైమ్స్ అఫ్ ఇండియా)

Sai Pallavi: ఇప్పటిదాకా చేసినవి 5 లేదా 6 సినిమాలే అయినప్పటికీ సాయి పల్లవి తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ని అందుకుంది. ఫిదా, ఎంసీఏ, లవ్ స్టోరీ వంటి సూపర్ హిట్ సినిమాలను అందుకున్న సాయిపల్లవి చేతిలో కూడా ఇప్పుడు "విరాటపర్వం", "శ్యామ్ సింగారాయి" వంటి పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. స్టార్ హీరోలతో నటించే అవకాశం రాకపోయినప్పటికీ మీడియం హీరోలతో నటిస్తూ కూడా సాయి పల్లవి భారీ బ్లాక్ బస్టర్లే అందుకుంటోంది. తాజాగా సాయి పల్లవి నెటిజన్లతో ముచ్చటించి తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఎలాంటి పాత్రల్లో నటించాలని ఉంది అని అడగగా సాయిపల్లవి తనకు కామెడీ పాత్రలో నటించాలని ఉంది అని చెప్పి అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే తాజాగా నెటిజన్లతో ముచ్చటించిన సాయిపల్లవి తనకి కామెడీ పాత్రల్లో నటించాలని ఉందని సాయిపల్లవి చెప్పడం గమనార్హం. ఇక తెలుగులో మాత్రమే కాక ఇతర భాషల్లో కూడా సాయిపల్లవికీ మంచి ఆఫర్లు లభిస్తున్నాయి. ఈ మధ్యనే సాయి పల్లవి నాగచైతన్య హీరో హీరోయిన్లుగా నటించిన "లవ్ స్టోరీ" సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా మారింది. శేఖర్ కమ్ముల ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

admin1

admin1

Next Story