Sai Pallavi:"అది నిజమైన ముద్దు కాదు" అంటున్న లవ్ స్టోరీ హీరోయిన్

* కెమెరా ట్రిక్ మరియు ఎడిటింగ్ మాయాజాలంతో ఆ సన్నివేశాన్ని అలా పండించారని చెప్పింది సాయి పల్లవి

admin1
Updated on: 30 Sept 2021 9:31 PM IST
Sai Pallavi Says in an Interview that I did not Kiss Naga Chaitanya
X

సాయి పల్లవి (ఫోటో- ది హన్స్ ఇండియా)

Sai Pallavi: మిగతా స్టార్ హీరోయిన్లు వేరు, సాయి పల్లవి వేరు. ఎందుకంటే ఈ "ఫిదా" బ్యూటీ సినిమాకి ఒప్పుకోవాలంటే కొన్ని నియమాలు ఉంటాయి. భారీ ఎక్స్పోజింగ్ కి ఆమె ససేమిరా ఒప్పుకోదు. అంతేకాకుండా ముద్దు సన్నివేశాలలో కూడా నటించే అవకాశమే లేదు. కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ మధ్యనే సాయి పల్లవి మరియు నాగచైతన్య హీరో హీరోయిన్లుగా నటించిన "లవ్ స్టోరీ" సినిమా విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి రెస్పాన్స్ ఉంటుంది. కానీ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఏకంగా రెండు ముద్దు సన్నివేశాలు ఉన్నాయి. ఈ విషయం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సాయిపల్లవి దీని గురించి క్లారిటీ ఇచ్చింది.

అదంతా ఒక ట్రిక్ అని చెప్పుకొచ్చింది సాయి పల్లవి. తాను నాగచైతన్యని ముద్దు పెట్టుకోలేదని క్లారిటీ ఇచ్చింది. కెమెరా ట్రిక్ మరియు ఎడిటింగ్ మాయాజాలంతో ఆ సన్నివేశాన్ని అలా పండించారని చెప్పింది సాయి పల్లవి. వచ్చిన సినిమాలన్నీ ఒప్పుకోకుండా కేవలం తనకు నచ్చిన పాత్రలు మాత్రమే చేస్తూ ముందుకు సాగుతున్న సాయిపల్లవి ఈ మధ్యనే చిరంజీవి "భోళా శంకర్" సినిమాలో చిరు చెల్లెలి పాత్ర చేసేందుకు రిజెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు లవ్ స్టోరీ సినిమా తెలుగు రాష్ట్రంలోనే కాక అమెరికాలో కూడా బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.

admin1

admin1

Next Story