Saipallavi: బాలీవుడ్ మూవీని తిరస్కరించిన సాయి పల్లవి?

Saipallavi: బాలీవుడ్ లో వచ్చిన ఆఫర్ ను సాయి పల్లవి సున్నితంగా తిరస్కరించిందని టాలీవుడ్ టాక్.

Kranthi
Published on: 12 May 2021 12:16 PM IST
Sai Pallavi Rejects Bollywood Movie
X

సాయి పల్లవి (ఫైల్ ఇమేజ్)

Saipallavi: శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన 'ఫిదా' సినిమాతో తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోతోంది. కథా బలం ఉన్న సినిమాలను ఎంచుకుంటూ..తన పాత్రల ద్వారా హావ భావాలను చక్కగా ప్రదర్శించగల నటిగా పేరు తెచ్చుకుంది. ఇటు తెలుగు, తమిళం, మళయాళంలో కూడా వరుస సినిమాల్లో నటిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో వచ్చిన ఆఫర్ ను సాయి పల్లవి సున్నితంగా తిరస్కరించిందని టాలీవుడ్ టాక్.

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఛత్రపతి హిందీ రీమేక్ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. వి వి వినాయక్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా పలువురు బాలీవుడ్ హీరోయిన్స్‌ను సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఎవరూ ఫైనల్ కాలేదని సమాచారం. ఈ క్రమంలో ఇటీవల ఫిదా బ్యూటీ సాయి పల్లవిని సంప్రదించారట. అయితే ప్రస్తుతం ఈమె టాలీవుడ్‌లో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉండటంతో డేట్స్ సర్దుబాటు చేయలేనని చెప్పినట్టు తెలుస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ - వినాయక్‌లకు హిందీలో డెబ్యూ సినిమా కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి.

Kranthi

Kranthi

Next Story