Sai Pallavi: పుష్పరాజ్ తో రొమాన్స్ చేయనున్న సాయి పల్లవి

Allu Arjun, Sai Pallavi: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈమధ్యనే "పుష్ప" సినిమాతో మర్చిపోలేని బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు.

Arun Chilukuri
Updated on: 11 Aug 2022 4:30 PM IST
Sai Pallavi in Pushpa The Rule?
X

Sai Pallavi: పుష్పరాజ్ తో రొమాన్స్ చేయనున్న సాయి పల్లవి

Allu Arjun, Sai Pallavi: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈమధ్యనే "పుష్ప" సినిమాతో మర్చిపోలేని బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి రెండవ భాగమైన "పుష్ప ది రూల్" తో బిజీగా ఉన్నారు బన్నీ. సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తయిపోయింది. ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరుగుతున్నాయి. మొదటి భాగానికి అదిరిపోయే మ్యూజిక్ అందించిన దేవిశ్రీప్రసాద్ ఈ సినిమా కోసం కూడా రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు.

ఈయనతో పాటు దర్శకుడు సుకుమార్ మరియు రచయిత చంద్రబోస్ కూడా మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ముగ్గురు ఇప్పుడు విదేశాల్లో కూర్చుని సంగీతం పనులు చూస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు "పుష్ప: ది రూల్" కాస్టింగ్ విషయంలో కొన్ని వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో శ్రీవల్లి పాత్ర చనిపోతుందని, ఆ స్థానంలో మరొక హీరోయిన్ కనిపిస్తుందని ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే సాయి పల్లవి పేరు కూడా వినిపించింది. ఈ సినిమాలో సాయి పల్లవి అడవుల్లో కనిపించే ఒక గిరిజన యువతి పాత్రలో కనిపించబోతోందని, పుష్పరాజ్ పాత్రకు ఈమె చిత్తూరు అడవుల్లో తారస పడుతుందని అప్పుడే వారిద్దరి మధ్య కొత్త ప్రేమాయణం మొదలవుతుందని తెలుస్తోంది. అయితే వీరిద్దరి ప్రేమ కథ కేవలం 20 నిమిషాలకు మాత్రమే పరిమితం అవుతుందని సమాచారం. ఇందులో నిజానిజాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉన్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story