Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ తో జతకట్టనున్న మలయాళి నటి

సాయి ధరమ్ తేజ్, సంయుక్త (ఫొటో హన్స్ ఇండియా)
Sai Dharam Tej: పరాజయాలు వెంటాడుతున్న టైంలో 'చిత్రలాహరి' సినిమాతో ఓ విజయాన్ని రుచి చూశాడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్.
Sai Dharam Tej: పరాజయాలు వెంటాడుతున్న టైంలో 'చిత్రలహరి' సినిమాతో ఓ విజయాన్ని రుచి చూశాడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్. కానీ, తన లేటెస్ట్ 'సోలో బ్రాతుకే సో బెటర్' మూవీతో మరో ఓటమిని మూటగట్టుకున్నాడు. ప్రస్తుతం, ఈ మెగా హీరో తన రాబోయే చిత్రం కోసం దేవా కట్టతో చేతులు కలిపాడు.
సోషల్ డ్రామాగా రాబోయే ఈ చిత్రంలో సాయి తేజ్ ఐఏఎస్ ఆఫీసర్ పాత్రను పోషించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ చిత్రంపై ఒక ఆసక్తికరమైన అప్డేట్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. తాత్కాలికంగా #SDT15 పిలిచే ఈ సినిమాలో మలయాళ బ్యూటీ సమ్యూక్తా మీనన్ కథానాయికగా నటించనుంది. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి రాబోతోంది.
ఈ సినిమా స్క్రిప్ట్ కు కొత్త హీరోయిన్ కావాలని భావించిన మేకర్స్ సంయుక్తను సంప్రదించారని సమాచారం. కాగా, ఈ హీరోయిన్ వెంటనే ఒప్పుకుందని వారు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లోని మూఢనమ్మకాల చుట్టూ ఈ కథ తిరుగుతుందని తెలుస్తోంది. ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించి, ఎస్వీసీసీ బ్యానర్‌తో పాటు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
PM Narendra Modi: తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోదీ...
3 July 2022 2:09 PM GMTAmit Shah: ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణలో అధికారం భాజపాదే
3 July 2022 1:15 PM GMTభాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
3 July 2022 2:40 AM GMTహైదరాబాద్‌లో కొనసాగుతున్న ఫ్లెక్సీ వార్.. కేసీఆర్ ఫ్లెక్సీలపై మోడీ ఫ్లెక్సీలు!
2 July 2022 1:30 PM GMTటీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్.. రూ. 96.21 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ..
2 July 2022 12:57 PM GMTమోడీకి అనేక ప్రశ్నలు సంధించిన కేసీఆర్.. రేపటి బహిరంగ సభలో జవాబులివ్వాలని సవాల్..
2 July 2022 12:30 PM GMTమోడీ భాగ్యలక్ష్మిని దర్శించుకుంటారా?
2 July 2022 11:48 AM GMT
Narendra Modi: కేసీఆర్ పేరు ఎత్తకుండా సాగిన మోడీ ప్రసంగం
3 July 2022 3:30 PM GMTకేసీఆర్‌ను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు : జేపీ నడ్డా
3 July 2022 3:00 PM GMTNarendra Modi: తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతోంది
3 July 2022 2:30 PM GMTPM Narendra Modi: తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోదీ...
3 July 2022 2:09 PM GMTTelangana: శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి తప్పిన ప్రమాదం
3 July 2022 2:00 PM GMT