Republic: 'గవర్నెన్స్ ఉందనే భ్రమలో జీవిస్తున్నా' మంటున్న మోగా హీరో

Republic Movie First Look: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ నేడు రిలీజ్ అయింది.

Venkata Chari
Published on: 25 March 2021 3:58 PM IST
Sai Dharam Tej Republic Movie First Look Released
X

సాయి ధరమ్ తేజ్ (ఫొటో ట్విట్టర్)

Republic Movie First Look: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ నేడు రిలీజ్ అయింది. 'ప్రస్థానం' ఫేమ్ దేవ కట్టా డైరెక్షన్ లో ''రిపబ్లిక్'' అనే పొలిటికల్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇందులో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తోంది. జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జె.భగవాన్ - జె.పుల్లారావు రిపబ్లిక్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ 4న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

కాగా ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా రిలైజైన టైటిల్, మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'రిపబ్లిక్' ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసి, టీం కు శుభాకాంక్షలు తెలిపారు.

"గవర్నెన్స్ ఉందని మనమంతా భ్రమలో జీవిస్తున్నాం.. కానీ మనం ఇంకా దానిని కనుగొనలేదు'' అంటూ 'రిపబ్లిక్' ఫస్ట్ లుక్ పోస్టర్ లో చెప్పుకొచ్చాడు సాయి తేజ్. స్కెచ్ తో డిజైన్ చేసిన సాయి తేజ్ ఫొటో ఆకట్టుకుంది.

కాగా, ఈ సినిమాలో సాయి తేజ్ ఓ ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడని సమాచారం. అలాగే ఈ చిత్రంలో జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఎమ్.సుకుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా.. కేఎల్ ప్రవీణ్ ఎడిటర్ గా పనిచేస్తున్నాడు.


Venkata Chari

Venkata Chari

Next Story