ప్రతిరోజూ పండగే : ట్విట్టర్‌ రివ్యూ

ప్రతిరోజూ పండగే : ట్విట్టర్‌ రివ్యూ
x
prathi roju pandage
Highlights

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం 'ప్రతిరోజూ పండగే'. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం...

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం 'ప్రతిరోజూ పండగే'. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం (డిసెంబర్ 20న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఎ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. పక్కా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది.

చిత్రలహరి, శైలజ రెడ్డి అల్లుడు సినిమాల తర్వాత సాయి ధరమ్ తేజ్, మారుతి సినిమా చేస్తుండడంతో సినిమాపైన మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు పెద్ద బ్యానర్లు గీతా ఆర్ట్స్, యువీ క్రియేషన్స్ సినిమాని నిర్మిస్తుండడంతో ఆ అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి. విడుదలైన సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ కి ప్రేక్షకులను నుంచి మంచి స్పందన లభించింది. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలో ప్రారంభమైపోయాయి. తెలుగులో ఇప్పటికే మిడ్ నైట్ షోస్ నడిచాయి. సినిమాని చూసినవాళ్లు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఫస్టాఫ్‌లో కొన్ని కామెడీ, ఎమోషనల్ సీన్స్‌తో దర్శకుడు మొదటి భాగాన్ని బాగా డీల్ చేశాడని చెబుతున్నారు. కానీ, రెండవ భాగం మాత్రం బాగా డల్ అయిపోయిందని టాక్ వినిపిస్తుంది.

సెకండాఫ్‌లో చాలా సన్నివేశాలను సాగదీశారని, రావు రమేష్ కామెడీ సీన్లు కొద్దిసేపు నవ్విస్తాయని అంటున్నారు. ఇక తమన్ అందించిన సంగీతం కూడా అంత గొప్పగా లేదని, నేపధ్య సంగీతం పర్వాలేదని అంటున్నారు. సినిమా మొత్తానికి సాయి ధరమ్ తేజ్ ఒక్కడే ప్లస్ గా చెబుతున్నారు. బి, సి సెంటర్లలో ఈ సినిమా ఆడటం కష్టమేనని అంటున్నారు. ప్రస్తుతానికి అయితే సినిమాకు యావరేజ్ టాక్ అయితే బలంగా వినిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories