మెగా హీరోతో మారుతి

Ruthvik
Updated on: 27 Feb 2019 3:36 PM IST
మెగా హీరోతో మారుతి
X

డైరెక్టర్ మారుతి అంటే టాలీవుడ్ లో ఒక గుర్తింపు ఉన్న మాట నిజమే. కామెడీ సినిమాలు తీయడంలో మారుతి టాప్ మోస్ట్ దర్శకులలో ఒకరు. అయితే 'మహానుభావుడు' సినిమా తరువాత మారుతి దర్శకత్వం వహించిన 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఆ తరువాత కొంతమంది మారుతి తదుపరి ప్రాజెక్టు విషయమై కొంత మంది హీరోల పేర్లు బయటకు వచ్చాయి కానీ మారుతి ఆ పుకార్లను కొట్టిపారేశాడు.

తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు మారుతి ఒక మెగా హీరో తో ఒక సినిమా చేయనున్నాడు. వరుస డిజాస్టర్ సినిమా లతో సతమతమవుతున్న మెగామేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా మారుతి ఒక సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. గీత ఆర్ట్స్ ప్రొడక్షన్ పతాకంపై బన్నీవాసు ఈ సినిమాను నిర్మించనున్నాడు. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. అన్నీ కుదిరితే ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన వెంటనే సాయి ధరంతేజ్ ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నాడు.

Ruthvik

Ruthvik

Next Story