OTT: రిలీజ్ దిశగా మెగా హీరో మూవీ..?

Sai Dharam Tej: టాలెంటెడ్ డైరెక్టర్ దేవాకట్టా దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది.

Samba Siva Rao
Updated on: 3 Jun 2021 11:27 AM IST
Sai Sai Dharam Tej Movie On OTT
X

Sai Dharam Tej (Twitter Image )

Sai Dharam Tej: టాలీవుడ్ సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన కొత్త సినిమా 'రిపబ్లిక్'. టాలెంటెడ్ డైరెక్టర్ దేవాకట్టా దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. 'సోలో బ్రతుకే సో బెటర్' హిట్ తర్వాత సాయితేజ్.. దేవ‌క‌ట్టా కాంబోలో వ‌స్తున్న చిత్రం కావ‌డంతో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ సినిమా ప్రస్తుతం వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. కాగా.. దేవాకట్టా ఓ రచయితగా.. దర్శకుడుగా ఆల్రెడీ తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. దేవాకట్టా నుంచి సినిమా రాబోతుండటంతో ఇండస్ట్రీ రిపబ్లిక్ విషయంలో ఆసక్తిగా ఎదురుచూస్తుంది.

దేవాకట్టా సినిమాని ఆలోచనాత్మకంగా తెరకెక్కించడంలో సిద్ధహస్తుడని టాలీవుడ్ వర్గాలు అంటొన్నాయి. రిపబ్లిక్ సినిమా గురించి కొత్తగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇటీవలే సినిమాను జూన్ 4న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ సినిమా కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. అయితే సినిమా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న త‌ర్వాత‌ ట్విట్టర్ వేదికగా మా సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. కేవలం 64 రోజుల్లో ఎలాంటి కరోనా కేసులు లేకుండా పూర్తి చేయడం ఆనందంగా ఉందని చెప్పాడు డైరెక్టర్.

తాజాగా రిపబ్లిక్ మూవీ గురించి ఇండస్ట్రీ వర్గాలలో ప‌లు వార్త‌లు వైరల్ అవుతున్నాయి.. రిపబ్లిక్ సినిమాను ఓటిటి రిలీజ్ చేసే దిశగా మేకర్స్ ఆలోచన చేస్తున్నారని టాక్ బలంగా వినిపిస్తుంది. అందులోను సినిమాను 'పే పర్ వ్యూ' పద్ధతిలో రిలీజ్ చేయనున్నట్లు బజ్ క్రియేట్ అయింది. ఇప్పటికే మేకర్స్ జీ గ్రూప్ వారితో చర్చలు జరుపుతున్నారని త్వరలోనే కన్ఫర్మేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. కానీ ఇంతవరకు మేకర్స్ నుండి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. మరి త్వరలోనే ఈ పుకార్లపై స్పందిస్తారా లేదా అనేది చూడాలి. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ కథానాయికగా నటిస్తుండగా.. జగపతిబాబు రమ్యకృష్ణ కీలకపాత్రలలో కనిపించనున్నారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story