Sai Dharam Tej: ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్న సాయి ధరమ్ తేజ్ సినిమా

Sai Dharam Tej: వేరే భాషల్లో విడుదల కాబోతున్న సాయి ధరంతేజ్ సూపర్ హిట్ సినిమా

Jyothi
Updated on: 25 April 2023 7:30 PM IST
Sai Dharam Tej Movie to be Released in Pan India Range
X

Sai Dharam Tej: ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్న సాయి ధరమ్ తేజ్ సినిమా

Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ వర్మ దండు అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి వచ్చిన విరూపాక్ష సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. మంచి అంచనాల మధ్య ఏప్రిల్ 21వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచి మంచి వసూళ్లను అందుకుంటుంది. వారాంతం పూర్తయిన తర్వాత కూడా వర్డ్ ఆఫ్ మౌత్ బాగుండడంతో కలెక్షన్లు కూడా స్ట్రాంగ్ గానే ఉన్నాయి. విడుదలైన నాలుగు రోజులకే బ్రేక్ ఈవెన్ పాయింట్ ను కూడా దాటేసిన ఈ చిత్రం ఇప్పుడు బ్లాక్ బస్టర్ అయ్యే దిశగా దూసుకు వెళ్తోంది.

చాలాకాలం తర్వాత సాయి ధరమ్ తేజ్ కి మర్చిపోలేని బ్లాక్ బస్టర్ అందించిన సినిమా ఇది. త్రిల్లింగ్ స్క్రీన్ ప్లే మరియు అద్భుతమైన కథతో సినిమా అధ్యంతం ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. బ్రేక్ ఈవెన్ పాయింట్ ని కూడా దాటేసి ఇప్పటికే ఈ చిత్రం ఒకటి పాయింట్ మూడు ఐదు కోట్ల లాభాలను గడిచింది. ఇంకా సినిమా థియేటర్లోనే ఉండి మంచి రివ్యూస్ కూడా వినిపిస్తునడంతో ప్రాఫిట్లు మరింత పెరిగే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.

తాజాగా ఇప్పుడు ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. నిజానికి తెలుగులో హిట్ అయితే ఈ సినిమాని వేరే భాషల్లో కూడా విడుదల చేద్దామని చిత్ర బృందం ముందే నిర్ణయించుకుంది. అనుకున్న విధంగానే సినిమా సూపర్ హిట్ అవడంతో ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీ, తమిళ్, కన్నడ, మరియు మలయాళం భాషలో కూడా చిత్ర బృందం విడుదల చేయబోతోంది. మరి ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా మిగతా భాషల్లో ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో వేచి చూడాలి.

Jyothi

Jyothi

Next Story